
నిజామాబాద్ జిల్లాలో ఓ పాఠశాలలో ఉర్దూ బోధిస్తున్నారన్న కారణంతో ప్రిన్సిపాల్‌పై కొందరు బీజేపీ నేతలు దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
పోలీసుల సమక్షంలోనే ప్రిన్సిపాల్‌ను చెంపదెబ్బ కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయంపై రాజకీయంగా దుమారం రేగింది.అసలేం జరిగింది?నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని భారత్ చంద్ర పాఠశాలలో శనివారం ఈ ఘటన జరిగింది. పాఠశాల యాజమాన్యం ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ అమెర్ ఖాన్, ఉర్దూను ద్వితీయ భాషగా బోధించేందుకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు స్థానిక బీజేపీ నేతలు పాఠశాలలోకి ప్రవేశించి, తమ పిల్లలకు ఉర్దూ పాటలు, మతపరమైన అంశాలు నేర్పుతున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వారు ప్రిన్సిపాల్ అమెర్ ఖాన్‌పై దాడి చేసి, చెంపదెబ్బ కొట్టారు.ఈ ఘటనపై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ షమా మొహమ్మద్ తీవ్రంగా స్పందించారు. ప్రిన్సిపాల్‌పై దాడి చేస్తున్న వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. "తెలంగాణలోని ఓ పాఠశాలలోకి బీజేపీ గూండాలు చొరబడి, పోలీసుల ముందే ఉర్దూ బోధిస్తున్న ఉపాధ్యాయుడిపై దాడి చేశారు. ఈ ఘటనలో సంబంధిత పోలీసు అధికారులను సస్పెండ్ చేసి, బీజేపీ గూండాలను కఠినంగా శిక్షించాలి" అని ఆమె డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ చెప్పే 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' ఎక్కడ? అని ఆమె ప్రశ్నించారు.ప్రిన్సిపాల్ ఆవేదనమరోవైపు, విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకే ఉర్దూను రెండో భాషగా ప్రవేశపెట్టినట్లు ప్రిన్సిపాల్ అమెర్ ఖాన్