
వంటింటి సీక్రెట్: పప్పు త్వరగా మెత్తగా ఉడకాలంటే..వంటింటి సీక్రెట్: పప్పు త్వరగా మెత్తగా ఉడకాలంటే.. 28 June 2026 TV9 Telugu TV9 Telugu ఎవరైనా మనల్ని మాయ చేయాలని చూస్తే..
‘మీ పప్పులు నా దగ్గర ఉడకవులే’ అంటాం కదా! ఆ సంగతలా ఉంచితే... కూరగాయలతో పోలిస్తే పప్పులు ఉడకటం కొంచెం కష్టమే కందిపప్పు మరీను. అయితే పప్పు త్వరగా ఉడకటానికి కొన్ని మెళకువలు ఉన్నాయి.. అవేంటో.. ఏమేం పాటించాలో ఇక్కడ చూడండి..
ముందు పప్పును దోరగా వేయించండి. ఇలా చేయడం వల్ల త్వరగా ఉడకటమే కాదు మంచి రుచీ పరిమళం వస్తాయి. కొంతసేపు నానబెడితే త్వరగా ఉడుకుతుంది సమయాన్నే కాదు, ఇంధనాన్నీ ఆదా చేసినట్లవుతుంది. కాస్త వంటసోడా వేస్తే వేగంగా ఉడుకుతుంది కొంత ఉడికిన తర్వాత పప్పుగుత్తితో మెదపండి అప్పుడు పని త్వరగానూ అవుతుంది, పప్పు మెత్తగానూ ఉంటుంది. ఉప్పు ముందుగా వేస్తే ఉడకటం ఆలస్యమౌతుంది. కారంతో పాటు ఉప్పును కూడా చివర్లోనే వేయండి టొమాటో పప్పు చేసేట్లయితే వాటిని ముందే చేర్చకండి. పప్పును విడిగా ఉడికించి... తాలింపులో ఉల్లిపాయ వేగాక టొమాటో ముక్కలు వేయడం ఉత్తమం ఎక్కువ నీళ్లు పోస్తే ఉడకటం ఆలస్యమౌతుంది. కాబట్టి తగినన్ని నీళ్లే పోయండి. సెగ పెంచితే త్వరగా పనైపోతుంది అనుకోవటం సరికాదు. దానివల్ల పొంగిపోవటం తప్ప ఫలితం ఉండదు తక్కువ సెగలో ఉడికించటమే మంచిది. పప్పుచారు, ఆకుకూరపప్పులకు నూనె కంటే నెయ్యి తాలింపు భేషనిపిస్తుంది. అలాగే కరివేపాకు, కొత్తిమీర వల్ల అదనపు రుచి వస్తుంది మరిన్ని వెబ్ స్టోరీస్ చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్ కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది? పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి