
అయోధ్య రామ్ మందిర్ (Ayodhya Ram Mandir) విరాళాల చోరీ కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది. ఆలయ ట్రస్ట్కు ఈ చోరీ వ్యవహారం ముందే తెలిసినప్పటికీ, అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఎందుకు...
అయోధ్య రామ్ మందిర్ (Ayodhya Ram Mandir) విరాళాల చోరీ కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది. ఆలయ ట్రస్ట్‌కు ఈ చోరీ వ్యవహారం ముందే తెలిసినప్పటికీ, అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఎందుకు జాప్యం జరిగిందనే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జూన్ 7న ఈ వ్యవహారం ప్రజల్లోకి రాకముందే, జూన్ 5నే ట్రస్ట్ ప్రతినిధులు పోలీసులతో కలిసి నిందితుడు అవినాష్ శుక్లా నివాసంలో సోదాలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.అయోధ్య చోరీ ట్రస్ట్ కు ముందే తెలుసా ?ఈ అనధికారిక సోదాల్లో పెద్ద ఎత్తున నగదు రికవరీ అయినప్పటికీ, అప్పట్లో ట్రస్ట్ ఎలాంటి అధికారిక ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ ఒక సీసీటీవీ దృశ్యం కూడా సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. అందులో పోలీసులు నిందితుడిని వాహనంలోకి తీసుకెళ్తుండడం, అతని చేతిలో నగదుతో కూడిన నల్లటి బ్యాగ్ ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో విశ్వసనీయత ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. సీసీటీవీకి ముసుగు- బాత్ రూమ్ లో డబ్బులు- అయోధ్య చోరీపై సిట్ షాకింగ్ రిపోర్ట్..!ఎస్ఐటీ దర్యాప్తులో షాకింగ్ అంశాలుఈ మొత్తం వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) విరాళాల నిర్వహణలో ఉన్న కీలక లోపాలను గుర్తించింది. ఆలయంలో నగదు నిర్వహణ, ఉద్యోగుల వెరిఫికేషన్, అలాగే సీసీటీవీల పర్యవేక్షణలో తీవ్ర నిర్లక్ష్యం జరిగినట్లు ఎస్ఐటీ తన నివేదికలో పేర్కొంది. విరాళాలను పర్యవేక్షించే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నియమించిన కొందరు సిబ్బందికి, ట్రస్ట్ ఉన్నతాధికారులతో సంబంధాలు ఉన్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి.రాజకీయ ప్రకంపనలుఈ విరాళాల అక్రమాల అంశం కాస్తా ఉత్తరప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పదేపదే అయోధ్యను సందర్శిస్తున్నప్పటికీ ఇలాంటి అక్రమాలు జరగడం విచారకరమని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. దీనిపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ అధ్యక్షుడు ఆలోక్ కుమార్ స్పందిస్తూ, 2027 అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ లాభం కోసమే ప్రతిపక్షాలు ఈ వివాదాన్ని తవ్వుతున్నాయని, అయితే తప్పు చేసిన వారిని ప్రభుత్వం తప్పకుండా శిక్షిస్తుందని స్పష్టం చేశారు. Ayodhya Ram Temple: అయోధ్య గుడిలో విరాళాల స్కాం-8 మంది అరెస్టు..!పోలీసుల దర్యాప్తు ముమ్మరంఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి, స్థానిక మేజిస్ట్రేట్ సమక్షంలో వారి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. కోర్టు వారికి జూన్ 29 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కోట్లాది మంది భక్తుల నమ్మకంతో ముడిపడి ఉన్న రామ్ మందిర్ ఆలయ వ్యవహారంలో సమగ్రమైన, పారదర్శకమైన దర్యాప్తు జరిపి త్వరలోనే దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.