
Lord Uday Nagaraju | హైదరాబాద్: ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న మొట్టమొదటి గ్లోబల్ డైలాగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్‌లో ఏఐ పాలసీ వ్యవస్థాపకుడు, యూకే పార్లమెంట్ సభ్యుడు తెలంగాణకు చెంది
న లార్డ్ ఉదయం నాగరాజు సంస్థ తరఫున పాల్గొనబోతున్నారు. జెనీవాలో జులై మొదటి వారంలో ఈ చారిత్రక సమావేశం జరగనుంది. యూఎన్ జనరల్ అసెంబ్లీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 193 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఏఐ గవర్నెన్స్, భద్రతా ప్రమాణాలు, అంతర్జాతీయ సహకారం వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. 2018 నుంచి జవాబుదారీతనంతో కూడిన AI విధానాల కోసం లార్డ్ నాగరాజు కృషి చేస్తున్నారు. ఈ ఆహ్వానం తనకెంతో గర్వకారణం అని పేర్కొన్నారు. ఆయన IEEE P7007.1 వర్కింగ్ గ్రూప్‌లో సభ్యుడిగానూ చేరారు. రోబోటిక్స్ నిపుణుడు డాక్టర్ ఎడ్సన్ ప్రెస్టెస్ నేతృత్వంలో పనిచేస్తున్న ఈ బృందం.. ఏఐ ఆధారిత రోబోటిక్స్, ఆటోమేటెడ్ సిస్టమ్స్‌లోని ప్రమాదాలను తగ్గించే నైతిక ఏఐ ప్రమాణాలు రూపొందిస్తోంది. సమాజం, ఆర్థిక వ్యవస్థ, పాలన వ్యవస్థల్లో ఏఐ భాగమవుతున్న ఈ సమయంలో లార్డ్ నాగరాజు రెండు కీలక బాధ్యతలు చేపట్టడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.