
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. చింతకాని మండలంలో భారీ వర్షం పడింది.
రేపు రైతు మేళా, ఎల్లుండి సీఎం సభ జరగాల్సిన ప్రాంతం పూర్తిగా జలమయమైంది. రైతు మేళాకు ఏర్పాటు చేసిన టెంట్లు ఈదురు గాలులకు కుప్పకూలాయి. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి, ఎడపల్లి, ఆర్మూర్, భిక్కనూర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో భారీవర్షం |