ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. స్పౌజ్ కేటగిరి కింద 7792 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. వీరికి జూలై నెలలో పింఛన్లు అంది
ంచనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. జూలై ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అలాగే జులై నెల పింఛన్ల కోసం రూ.2711.79 కోట్ల నిధుల్ని విడుదల చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. 62,19,648 మంది పింఛన్దారులకు పింఛన్ అందించటం కోసం ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. స్పౌజ్ కేటగిరీ కింద 7792 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేశామన్న మంత్రి.. జూలై ఒకటో తేదీ వీరికి పింఛన్ అందించేందుకు రూ. 3.12 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకూ ఎన్డీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం రూ. 68,598.44 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.వితంతు పింఛన్లపై కసరత్తుమరోవైపు ఏపీ ప్రభుత్వం పలు కేటగిరీల కింద పింఛన్లు అందిస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో వితంతు కేటగిరీ పింఛన్లను మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ కేటగిరిలో రాష్ట్రవ్యాప్తంగా 2.20 లక్షల మంది అర్హులను గుర్తించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇటీవల తెలిపారు. వితంతు పింఛన్ల కోసం మార్గదర్శకాలు రూపొందిస్తు్న్నామని.. ఒకట్రెండు నెలల్లో వితంతు పింఛన్లు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వితంతు పింఛన్ల కింద అర్హులైన వారికి ప్రభుత్వం ప్రతినెలా నాలుగు వేల రూపాయలు అందిస్తుంది. స్పౌజ్ పింఛన్లంటే.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం కింద ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే.. అతని భార్యకు పింఛన్ అందిస్తారు. భర్త మరణించిన సందర్భంలో.. పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మరుసటి నెలనుంచే అతని భార్యకు స్పౌజ్ కేటగిరీ కింద పింఛన్లు అందిస్తున్నారు. నెలకు రూ.4 వేలు చొప్పున అందిస్తున్నారు. వృద్ధులు, వితంతువులకు నాలుగు వేలు చొప్పున, దివ్యాంగులకు రూ.6000 చొప్పున ఏపీ ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి, పూర్తి వైకల్యం ఉన్నవారికి పింఛన్లు అందిస్తున్నారు