
హైదరాబాద్: టీజీ20 లీగ్ 2026లో కరీంనగర్ డైమండ్స్ బోణీ చేసింది. ఆదివారం వరంగల్ వారియర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.
210 పరుగుల లక్ష్యఛేదనలో వరంగల్ 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. రిషికేత్ సిసోదియా (65; 31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు), భవేశ్ సేథ్ (53*; 27 బంతుల్లో 6 సిక్స్‌లు) పోరాడినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. హర్షిత్ చౌదరి (31), శౌనక్ కులకర్ణి (14*) పరుగులు చేశాడు. కరీంనగర్ బౌలర్లలో సతీష్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. శుభమ్ శర్మ, దినేశ్, హరీశ్ ఠాకూర్, ఆశిష్ శ్రీవాస్తవ్ తలో వికెట్ తీశారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (133; 61 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్స్‌లు) ‘శత’క్కొట్టాడు. ఓపెనర్ సాత్విక్ రెడ్డి (4) తొలి ఓవర్లోనే వెనుదిరిగినా.. తన్మయ్ మిగతా బ్యాటర్ల సాయంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ, 52 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హృషికేశ్ సింహ (24), చందన్ సహాని (16), రాహుల్ రాదేశ్ (15*) పరుగులు చేశారు. వరంగల్ బౌలర్లలో ముదస్సర్ హుస్సేన్ 2, ఆది మణి కిరణ్, శౌనక్ కులకర్ణి, మురుగన్ అభిషేక్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: టీజీ20 లీగ్ 2026లో భాగంగా ఉప్పల్ వేదికగా వరంగల్ వారియర్స్, కరీంనగర్ డైమండ్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (133; 61 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్స్‌లు) ‘శత’క్కొట్టాడు. ఈ మ్యాచ్ ఫొటోలు మీ కోసం..