
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ అయోధ్యపై చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రామభక్తులపై కాల్పులు జరిపిన చరిత్ర ఉన్న ఎస్పీ, అయోధ్యను పవిత్ర నగరంగా ఎలా తీర్చిదిద్దుతుందని ఆయన ప్రశ్నించారు. హిందూ మత సంప్రదాయాలను వ్యతిరేకించడమే ఎస్పీ నైజమని, ఆ పార్టీకి ఆలయ నగరి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని యోగి ఆరోపించారు.అయోధ్య విరాళాల్లో అవినీతిపై స్పందిస్తూ, తాము అధికారంలోకి వస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు అసలైన ఆధ్యాత్మికతను అనుభవించేలా అయోధ్యను అద్వితీయమైన, సాటిలేని పవిత్ర నగరంగా అభివృద్ధి చేస్తామని అఖిలేశ్ యాదవ్ శనివారం 'ఎక్స్' వేదికగా ఒక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో, హత్రాస్‌లో రూ.548 కోట్ల విలువైన 143 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం యోగి మాట్లాడుతూ అఖిలేశ్ పై విమర్శలు గుప్పించారు. "నిన్న అఖిలేశ్ యాదవ్ ప్రకటన చూసి ఆశ్చర్యపోయాను. ఆయన ప్రభుత్వం వస్తే అయోధ్యను పవిత్ర నగరంగా చేస్తారట. మీరు ఏం పవిత్ర నగరం కడతారు? ముందు మీ చరిత్ర చూసుకోండి. రామభక్తులపై కాల్పులు జరిపించింది మీరే కదా?" అని యోగి నిలదీశారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, రామభక్తుల కృషి ఫలితంగా అయోధ్య నేడు తన పూర్వ వైభవాన్ని సంతరించుకుని 'త్రేతాయుగాన్ని' గుర్తుచేస్తోందని యోగి అన్నారు. ఈ అభివృద్ధిని చూసి ఇప్పుడు మీకు కూడా ఆశ కలుగుతోందని ఎద్దేవా చేశారు. గతంలో ఎస్పీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లు, జైళ్లలో కృష్ణాష్టమి వేడుకలను నిలిపివేసిందని, కన్వర్ యాత్రపై ఆంక్షలు విధించిందని యోగి