
KTR | వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్ లో వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ తెలంగాణలో అప్పులపై స్పీకర్ అబద్దాలు ఆడటంపై ఫైర్ అయ్యారు. స్పీకర్ మీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గడ్డం ప్రసాద్ గారు గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉండి.. కేసీఆర్ మొత్తం అప్పులు చేసి పోయాడు.. మాకు ప్రభుత్వం నడుపొస్తలేదని అబద్ధాలు చెబుతున్నారన్నారు.
దయచేసి నేను వికారాబాద్ వేదికగా అడుగుతున్నా. స్పీకర్ మీరు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీ నోటి నుంచి ఇలాంటి సత్యదూరమైన మాటలు, అబద్దాలు, అసత్యాలు, అర్థసత్యాలు మీ గౌరవాన్ని తగ్గిస్తయి తప్ప పెంచయి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి అబద్ధాలు ఆడితే మీ గౌరవం తగ్గుతుంది తప్ప పెరగదని కేటీఆర్ హితవు పలికారు.
మీరేమో శాసనసభలో స్పీకర్గా ఉన్నరు.. RBI, CAG వద్ద నుండి లెక్కలు తీసుకొని మీలాగే అనుమానమొచ్చి తెలంగాణలో కేసీఆర్ చేసిన అప్పు ఎంత..? అని నిండు పార్లమెంట్లో ఒక బీజేపీ ఎంపీ అడిగిండు. 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం నెత్తిమీదున్న అప్పు 72 వేల కోట్లు.. కేసీఆర్ దిగిపోయిన్నాడు డిసెంబర్ 03, 2023 నాడు తెలంగాణపై ఉన్న అప్పుడు 3 లక్షల 52 వేల కోట్లు.. అంటే కేసీఆర్ 10 ఏండ్లలో చేసిన అప్పు రూ.2.80 వేల కోట్లని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది.. అంటే సంవత్సరానికి సగటున 28 వేల కోట్లు కానీ స్పీకర్ రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని చెబుతున్నాడు, డిప్యూటీ సీఎం రూ. 9 లక్షల కోట్లు అంటాడు.. ఇంకొకైన 10 లక్షలు అంటడు.. నోటికి ఎంత వస్తే అంత చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
గడ్డం ప్రసాద్ గారు గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉండి.. కేసీఆర్ అప్పులు చేసి పోయాడని అబద్ధాలు చెబుతున్నాడు స్పీకర్ గారు మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి అబద్ధాలు ఆడితే మీ గౌరవం తగ్గుతుంది తప్ప పెరగదు RBI, CAG వద్ద నుండి లెక్కలు తీసుకొని, 10 ఏండ్లలో కేసీఆర్ చేసిన అప్పు… — Telugu Scribe (@TeluguScribe) June 28, 2026 Road accident | ట్రాలీ ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు దుర్మరణం Sonu Sood | అయోధ్య విరాళాల వివాదంపై స్పందించిన సోనూ సూద్.. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్!
Nalgonda | సీఎం పర్యటన వేళ ప్రోటోకాల్ వివాదం.. పత్రికా ప్రకటనల్లో మండలి చైర్మన్ గుత్తా ఫొటో లేకపోవడంపై ఆగ్రహం