Bank Holidays: మీరు తరుచూ బ్యాంకుకు వెళ్తుంటారా? బిజినెస్ లావాదేవీలకు సంబంధించి చెక్కులు డిపాజిట్ చేయడం లేదా నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి సేవలు నిర్వహిస్తుంటారా? అయితే ఇది మీలాంటి వారకోసమే.
బ్యాంకు బ్రాంచుకు వెళ్లి పనులు పూర్తి చేయాల్సి ఉన్న వారు కచ్చితంగా బ్యాంకు పని వేళల వివరాలు తెలుసుకోవాలి. అలాగే బ్యాంకులు ఏ రోజు తెరిచి ఉంటాయి, ఏ రోజు సెలవు ఉంటుంది? అనే వివరాలూ తెలిసి ఉండాలి. ఈ క్రమంలోనే జులై 2026 నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు వస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ ప్రకారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు జులై నెలలో 12 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి మారిపోతుంటాయి.జాతీయ పండుగలు, రాష్ట్ర అవతరణ, స్థానిక పండగలకు సెవలు రాష్ట్రాల వారిగా మారిపోతుంటాయి. అలాగే సాధారణ సెలవులు ఉంటాయి. అందుకే మన ప్రాంతంలో బ్యాంకులు ఏ రోజు తెరిచి ఉంటాయి, ఏ రోజు మూసిఉంటాయి? అనే వివరాలు కచ్చితంగా తెలుసుకోవాలి. జులై నెలలో మొత్తం 12 రోజులు మూతపడనున్నాయి. వీటిల్లోల సాధారణ వారాంతపు సెలవులతో పాటు వివిధ రాష్ట్రాలలో వచ్చే స్థానిక, సాంస్కృతిక పండుగల సెలవులు సైతం ఉంటాయి. మరి జుల్ 2026 సెలవుల జాబితా ఇప్పుడే మనం తెలుసుకుందాం. జులై 5వ తేదీ ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ వారాంతపు సెలవు ఉంటుంది జులై 6వ తేదీ సోమవారం: ఎంహెచ్ఐపీ దినోత్సవం సందర్భంగా మిజోరం ఐజ్వాల్ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. జులై 9వ తేదీ గురువారం: పెహ్టియన్ క్లామ్ పండగ సందర్భంగా మేఘాలయ రాష్ట్రంలో బ్యాంకులు మూసి ఉంటాయి. జులై 11వ తేదీ శనివారం: నెలలో రెండో శనివారం సందర్భంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. జులై 12వ తేదీ ఆదివారం: దేశవ్యాప్తంగా ఆదివారం రోజున సాధారణ వారాంతపు సెలవు ఇస్తారు. జులై 16వ తేదీ గురువారం: జగన్నాథ స్వామి మహత్తర రథయాత్ర సందర్భంగా ఒడిశాలో బ్యాంకులకు సెలవు ఇచ్చారు. జులై 18వ తేదీ శనివారం: డ్రుక్పా సే సే పండగ సందర్భంగా సిక్కిం రాష్ట్రంలో సెలవు ఉంటుంది. జులై 21, 22 మంగళ, బుధవారాలు: కర్చీ పూజ సందర్భంగా త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. జులై 25వ తేదీ శనివారం: నెలలో నాలుగవ శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. జులై 26వ తేదీ ఆదివారం: దేశంలోని అన్ని బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. జులై 31వ తేదీ శుక్రవారం: స్వాతంత్య్ర సమరయోధుడు షహీద్ ఉదమ్ సింగ్ అమరత్వ దినోత్సవం సందర్భంగా హరియాణాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.