
ఇంటర్నెట్ డెస్క్: టీజీ20 లీగ్ రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. విజయాల కోసం ప్రతి జట్టూ చివరి వరకూ పోరాడుతోంది. భారీ స్కోర్లను సైతం అలవోకగా ఛేదిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.
ఈ క్రమంలో పాలమూరు స్ట్రైకర్ తమ మెంటార్‌గా శ్రీలంకకు చెందిన మాజీ ఫాస్ట్ బౌలర్ చమిందా వాస్‌ను నియమించుకుంది. ఈ మేరకు అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.
‘‘శ్రీలంక దిగ్గజ క్రికెటర్ చమిందా వాస్ మా జట్టుతో చేరుతున్నారు. అతడి అనుభవం, నైపుణ్యం తప్పకుండా మా జట్టుకు ఉపయోగపడతాయని గర్వంగా చెబుతున్నాం. మెంటార్‌గా పాలమూరు స్ట్రైకర్‌కు అండగా నిలుస్తారని ఆశిస్తున్నాం’’ అని ఫ్రాంచైజీ తెలిపింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాలమూరు స్ట్రైకర్స్ ఏడో స్థానంలో ఉంది. ఆడిన నాలుగింట్లో ఒక్క విజయం మాత్రమే నమోదు చేసింది. ఇక హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ హ్యాట్రిక్ విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.