
KTR | వికారాబాద్ జిల్లా : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కార్యకర్తలతో జిల్లాలు, నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా ఉన్నారని తెలిసిందే.
మరోవైపు ఎస్ఐఆర్ కార్యక్రమంపై కూడా పార్టీ శ్రేణులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా కేటీఆర్ ఆదివారం వికారాబాద్‌కు చేరుకున్నారు.
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్ లో వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో పాల్గొనేందుకు వికారాబాద్‌కు చేరుకున్నారు. కేటీఆర్ కార్యకర్తలు, నేతలతో కలిసి పట్టణ కేంద్రంలో గులాబీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జై రామన్న, సీఎం సీఎం అంటూ.. కేటీఆర్‌కు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కేటీఆర్ పార్టీ శ్రేణులకు సర్, సభ్యత్వ నమోదుపై బిఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
కేటీఆర్‌కు వెల్ కమ్ చెబుతూ బీఆర్ఎస్ కార్యకర్తల సందడి.. వీడియో