
Mann ki baat| ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో బంగారం కొనుగోళ్లు తగ్గడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు.
తాను ఇచ్చిన పిలుపు విని బంగారం కొనుగోళ్లు తగ్గించడంపై ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. మనకీ బాత్ 135వ ఎపిసోడ్లో భాగంగా ఆదివారం ప్రధాని పలు అంశాలను ప్రస్తావించారు (PM Modi mann ki baat). నాగాలాండ్ విమెన్ ఫుట్సల్ లీగ్ గురించి వివరించారు.
‘‘పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇటీవల దేశ ప్రజలకు కొన్ని అభ్యర్థనలు చేశాను. సాధ్యమైన మేర కొంతకాలం పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని చెప్పాను. నా పిలుపునకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. సందేశాల ద్వారా వారి అనుభవాలను పంచుకున్నారు. ఇంతకాలం సొంతవాహనాల్లో వెళ్లినవారు.. ఇప్పుడు ఇతరులతో కలిసి వెళ్తున్నారు. ఈసారి విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకున్నామని పలువురు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు’’ అని మోదీ (PM Modi) సంతోషం వ్యక్తంచేశారు.
అలాగే యువత క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో నాగాలాండ్ రాష్ట్రం స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. ‘‘ఆ రాష్ట్రంలో ‘నాగాలాండ్ బేబీ లీగ్’ నడుస్తోంది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయసులో ఉన్న చిన్నారుల్లో స్ఫూర్తి నింపి.. వారు క్రీడలవైపు మొగ్గుచూపేలా చేస్తోన్న అసాధారణ లీగ్ అది. అదే రాష్ట్రంలో నాగాలాండ్ విమెన్ ఫుట్సల్ లీగ్‌ను నిర్వహిస్తున్నారు. ఫుట్సల్ పదం చాలామందికి కొత్తగా ఉంటుంది. ఇండోర్ ఫుట్‌బాల్‌ను అలా పిలుస్తారు. ప్రతి జట్టులో కేవలం ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. సాధారణ ఫుట్‌బాల్ మైదానంతో పోలిస్తే.. వారు ఆడే స్థలం చాలా చిన్నగా ఉంటుంది. దీంతో ఆటగాళ్లు చాలావేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆడబిడ్డల్లోని ప్రతిభను వెలికితీయడానికి ఇది అద్భుతమైన వేదికగా నిలుస్తోంది’’ అని మోదీ కొనియాడారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు.
పెళ్లి పత్రికల సేకరణతో గిన్నిస్ రికార్డు సాధించిన కేరళ వాసి.. తన కుమారుడి వివాహానికి వినూత్నమైన శుభలేఖను ఎంచుకున్నారు.