
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వరల్డ్ కప్‌లో లీగ్ స్టేజ్ ముగిసింది. 48 జట్లు బరిలోకి దిగగా..
నాకౌట్ స్టేజ్‌కు 32 అర్హత సాధించాయి. ఇక్కడ్నుంచి ఎవరు గెలిస్తే వారే ముందడుగు వేస్తారు. మిగతా జట్లు ఇంటిముఖం పడతాయి. ఈ క్రమంలో ఆఫ్రికా దేశాలు ఫిఫా ప్రపంచ కప్‌లో సరికొత్త చరిత్రను లిఖించాయి. మరి ఆ ఘనత ఏంటి? అలాగే ‘రౌండ్ 32’లో తలపడే జట్లేవో కూడా ఓ లుక్కేద్దాం..
నాకౌట్లో అడుగు పెట్టిన 32 జట్లలో తొమ్మిది ఆఫ్రికా దేశాలు కావడం గమనార్హం. ఒకే వరల్డ్ కప్‌లో ఆఫ్రికాకు చెందిన టీమ్‌లు రెండు మాత్రమే గతంలో నాకౌట్‌కు చేరేవి. అదీనూ 2014, 2022 ప్రపంచ కప్‌ల్లో జరిగింది. ఈసారి మాత్రం ఏకంగా 10 టీముల్లో 9 దూసుకొచ్చాయి. అందులో అతిచిన్న దేశం కేప్ వెర్డె కూడా ఉంది. మిగతా జట్లలో మొరాకో, దక్షిణాఫ్రికా, సెనెగల్, ఐవరీ కోస్ట్, ఘనా, ఈజిప్ట్, కాంగో, అల్జీరియా కూడా అర్హత సాధించాయి. ఇక ప్రపంచ కప్‌లో సెమీస్‌కు చేరిన ఏకైక జట్టు దక్షిణాఫ్రికా. నాలుగేళ్ల కిందట ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో సఫారీ జట్టు సెమీఫైనల్లో అడుగు పెట్టింది. మరి ఇప్పుడు ఎన్ని జట్లు వెళ్తాయో చూడాలి. రౌండ్32లో గెలిచిన జట్టు రౌండ్ 16కు వెళ్తుంది. అక్కడ నుంచి క్వార్టర్స్ ఫైనల్స్‌కు ఎనిమిది టీమ్‌లు వెళ్తాయి. క్వార్టర్స్‌లో గెలిచిన నాలుగు టీమ్‌లు సెమీస్‌లో తలపడాయి. అక్కడ్నుంచి ఫైనల్లో కప్పు కోసం ఢీకొట్టుకుంటాయి.
‘రౌండ్ 32’కు అర్హత సాధించిన జట్ల మధ్య సోమవారం నుంచి మ్యాచులు ప్రారంభమవుతాయి. మొత్తం 16 మ్యాచుల్లో విజేతలుగా నిలిచిన టీమ్‌లు రౌండ్16 లేదా ప్రిక్వార్టర్స్‌లో తలపడతాయి. ఓడిన టీమ్ ఇంటిముఖం పట్టాల్సిందే. ఇక్కడ డ్రా అనే మాటే ఉండదు. నిర్ణీత సమయం, అదనపు సమయంలోగా ఎవరూ గోల్స్ చేయకపోతే.. పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.