
ఒకప్పుడు మంచి చదువు, ఉన్నత ఉద్యోగం, విదేశీ అవకాశాలు ఉంటేనే మంచి ఆదాయం సంపాదించగలమనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచం కొత్త అవకాశాలకు తలుపులు తెరిచింది.
ముఖ్యంగా యూట్యూబ్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా ల ద్వారా లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు కొందరు. కాస్త టాలెంట్ ఉంటే చాలు.. యూట్యూబ్ ద్వారా పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో బ్యాంకాక్ పిల్ల అలియాస్ శ్రావణి సామంతపూడిదే కూడా ఒకరు.
యూట్యూబ్ ప్రేక్షకులకు బ్యాంకాక్ పిల్లగా పరిచయం ఉన్న శ్రావణి.. భర్త ఉద్యోగరీత్యా థాయ్‌లాండ్‌కు వెళ్లడంతో శ్రావణి కూడా డిపెండెంట్ వీసాపై అక్కడికి వెళ్లారు. అయితే ఆ వీసాతో ఉద్యోగం చేసే అవకాశం లేకపోవడంతో ఆమెకు రోజంతా ఖాళీ సమయం ఉండటం.. ఆ సమయాన్ని ఉపయోగించుకోవడం కోసం యూట్యూబ్ ఛానెల్ ను స్టార్ట్ చేసింది. బ్యాంకాక్ లో తాను తన ఫ్యామిలీతో చేసే పనులు, రోజువారి లైఫ్ స్టైల్ అక్కడ ఎలా ఉంటుంది అనేది వీడియోలు తీసి పెట్టేది. ముందుగా ఫ్యామిలీ వ్లాగ్స్ వంటి అంశాలతో వరుసగా నాలుగు యూట్యూబ్ ఛానళ్లు ప్రారంభించిన శ్రావణి.. సబ్స్క్రైబర్లు, వ్యూస్ రాకపోవడంతో కొత్తగా ఆలోచించింది. వెంటనే బ్యాంకాక్ పిల్ల పేరుతో ఒకే ఒక్క ఛానెల్ ను నడిపిస్తుంది.
థాయ్‌లాండ్‌లో తనకు ఎదురైన అనుభవాలు, అక్కడి సంస్కృతి, తన కళ్లకు కనిపించిన విశేషాలు, విదేశాల్లో భారతీయుల జీవనశైలి వంటి అంశాలను వీడియోల రూపంలో ప్రేక్షకులకు అందించడం ప్రారంభించారు. ఈ క్రమంలో థాయ్‌లాండ్ ఆటోలపై రూపొందించిన ఒక షార్ట్ వీడియో ఏకంగా వన్ మిలియన్ వ్యూస్ సాధించడంతో ఆమె ఛానల్‌కు మంచి గుర్తింపు వచ్చింది.
2022 ఆగస్టులో ప్రారంభమైన ‘బ్యాంకాక్ పిల్ల’ ఛానల్ ఏడాది పూర్తికాకముందే సుమారు 8 లక్షల మంది సబ్స్క్రైబర్లను సంపాదించింది. ప్రస్తుతం ఈ ఛానల్‌కు 30 లక్షల 84 వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.
ఇప్పటి వరకూ 600 లకు పైగా వీడియోలు పెట్టిన బ్యాంకాక్ పిల్ల ఛానెల్ కు మిలియన్లలో వ్యూస్ వస్తుండటంతో.. యూట్యూబ్‌లో ప్రముఖ తెలుగు వ్లాగర్లలో ఒకరిగా ఆమెకు గుర్తింపు కూడా దక్కింది. ఈ ఛానల్ ప్రారంభించిన రెండో నెలలోనే శ్రావణి సుమారు 2 వేల అమెరికన్ డాలర్లకు పైగా ఆదాయం పొందారు. భారత కరెన్సీలో అది దాదాపు రూ.2 లక్షలకు సమానం.
ఆ తర్వాత ఆమె ఛానల్‌కు ఆదరణ పెరుగుతుండటంతో ప్రతి నెల ఆదాయం కూడా క్రమంగా పెరిగింది. ప్రస్తుతం బ్యాంకాక్ పిల్ల అలియాస్ శ్రావణి నెలకు సుమారు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. అఫీషియల్ గా ఆమె తన సంపాదన వెల్లడించకపోయినా.. ఆమెకుఉన్న సబ్ స్క్రైబర్లు, వీడియోలకు లక్షల్లో వస్తున్నవ్యూస్ ప్రాకారం భారీగానే సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది.