
శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ తిలకరత్నే దిల్షాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న టీజీ20 లీగ్‌లో ఆయన 'ఖమ్మం ఏసెస్' జట్టుకు మెంటార్‌గా...
శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ తిలకరత్నే దిల్షాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న టీజీ20 లీగ్‌లో ఆయన 'ఖమ్మం ఏసెస్' జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ టోర్నమెంట్ షెడ్యూల్ మధ్య లభించిన విరామ సమయంలో దిల్షాన్ తిరుమలకు విచ్చేశాడు.ఈరోజు ఉదయం విరామ దర్శన సమయంలో దిల్షాన్ స్వామివారి సేవలో పాల్గొన్నాడు. ఆలయ సంప్రదాయాలను గౌరవిస్తూ పంచెకట్టులో కనిపించాడు. దర్శనం పూర్తయిన తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు. అనంతరం టీటీడీ అధికారులు దిల్షాన్‌ను శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు.ఆలయం వెలుపలికి వచ్చిన దిల్షాన్‌ను చూసేందుకు భక్తులు, క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. అతనితో సెల్ఫీల కోసం పోటీపడ్డారు. దిల్షాన్ కూడా ఎంతో ఓపికగా చిరునవ్వుతో అభిమానులను పలకరిస్తూ ఫొటోలకు పోజులిచ్చి వారిని ఆనందపరిచారు.