
టెక్ దిగ్గజం గూగుల్, సోషల్ మీడియా సంస్థ మెటాకు ఊహించని షాక్ ఇచ్చింది. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్ అయిన 'జెమినీ' వాడకంపై మెటాకు పరిమితులు విధించింది.
ఏఐ ప్రాజెక్టుల కోసం మెటా అడిగినంత భారీ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందించడంలో గూగుల్ విఫలం కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ పరిణామం టెక్నాలజీ పరిశ్రమలో ఏఐ వనరుల కోసం పెరుగుతున్న తీవ్రమైన ఒత్తిడిని మరోసారి బహిర్గతం చేసింది.ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం ఈ ఏడాది మార్చి నుంచే ఈ పరిమితులు అమల్లోకి వచ్చాయి. గూగుల్ ఏఐ సేవలను అత్యధికంగా వినియోగించుకుంటున్న అతిపెద్ద కస్టమర్లలో మెటా ఒకటి. అయితే, జెమినీ ఏఐ మోడళ్ల కోసం మెటా నుంచి అసాధారణ స్థాయిలో డిమాండ్ రావడంతో, గూగుల్ తన వద్ద ఉన్న వనరులతో ఆ డిమాండ్‌ను అందుకోలేకపోయింది. ఈ సామర్థ్య కొరత కారణంగా మెటా అంతర్గతంగా చేపడుతున్న పలు కీలక ఏఐ ప్రాజెక్టులు ఆలస్యం కావడమే కాకుండా, కొన్నింటికి అంతరాయం కూడా ఏర్పడినట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన మెటా, తమ ఉద్యోగులు ఏఐ వనరులను, ముఖ్యంగా ఏఐ వాడకాన్ని కొలిచే యూనిట్లయిన 'ఏఐ టోకెన్ల' వినియోగాన్ని తగ్గించుకోవాలని, వాటిని మరింత సమర్థవంతంగా ఉపయోగించాలని సూచనలు జారీ చేసింది.ఈ సమస్య కేవలం మెటాకు మాత్రమే పరిమితం కాలేదు. గూగుల్ క్లౌడ్ సేవలను వినియోగించుకుంటున్న మరికొన్ని కంపెనీలు సైతం ఇలాంటి పరిమితులనే ఎదుర్కొంటున్నప్పటికీ, మెటాపై పడిన ప్రభావం చాలా తీవ్రంగా ఉందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం టెక్ కంపెనీలన్నీ ఏఐ సామర్థ్యాలను