
తియ్య గుమ్మడి సూప్.. తయారీకి కావలసిన పదార్థాలు: తియ్య గుమ్మడి కాయ ముక్కలు - 400 గ్రాములు, ఉల్లి ముక్కలు - కప్పు, వేయించిన గుమ్మడి గింజలు - రెండు స్పూన్లు కావలసిన పదార్థాలు: తియ్య గుమ్మడి కాయ...
తియ్య గుమ్మడి సూప్.. తయారీకి కావలసిన పదార్థాలు: తియ్య గుమ్మడి కాయ ముక్కలు - 400 గ్రాములు, ఉల్లి ముక్కలు - కప్పు, వేయించిన గుమ్మడి గింజలు - రెండు స్పూన్లు
కావలసిన పదార్థాలు: తియ్య గుమ్మడి కాయ ముక్కలు - 400 గ్రాములు, ఉల్లి ముక్కలు - కప్పు, వేయించిన గుమ్మడి గింజలు - రెండు స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి - స్పూను, క్యారెట్ ముక్కలు - అర కప్పు, క్రీమ్ - కాస్త, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, నీళ్లు - తగినంత, ఆలివ్ నూనె - రెండు స్పూన్లు.
తయారుచేసే విధానం: ఓ బాణలిలో నూనె వేసి ఉల్లి ముక్కలని వేయించాలి. ఉల్లి రంగు మారాక వెల్లుల్లిని వేయాలి. ఆ తరవాత గుమ్మడి ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి రెండు నిమిషాలు వేయించాలి. రెండు గ్లాసుల నీళ్లు కలిపి పావుగంట పాటు ఉడికించి స్టవ్ కట్టేయాలి. పూర్తిగా చల్లారాక బ్లెండర్లో వేసి చిక్కటి ద్రావకంలా చేసుకోవాలి. కప్పుల్లో వేసే ముందు క్రీమ్, గుమ్మడి గింజలు వేసి కలిపితే సరి.
బంగాళదుంపలు ఉడికించిన నీటిని పారబోస్తున్నారా?
Read Latest AP News And Telangana News And International News And Telugu News