
తండ్రికి రెండో వివాహం జరగలేదు, ఆ ఆరుగురు అమ్మాయిలు నా తండ్రికి పుట్టిన బిడ్డలే కాదు.. వారు వివాహేతర సంబంధంతో పుట్టినవారు!
అంటూ కన్న తండ్రి రెండో భార్య బిడ్డలను, వారి పుట్టుకను అవమానిస్తూ దశాబ్దం పాటు ఆస్తి కోసం కుమారుడు చేసిన న్యాయపోరాటం చివరికి పరాభవంతో ముగిసింది. చట్టబద్ధమైన సంతానానికి, వంశపారంపర్య ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది అంటూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ ఉద్వేగభరితమైన న్యాయపోరాటంలో చివరకు రెండో భార్య బిడ్డలే విజేతలుగా నిలిచారు.అవమానంతో మొదలైన పోరాటం..కాకినాడ సమీపంలోని గైగోలుపాడుకు చెందిన తురంగి సోమరాజు కుటుంబంలో ఆస్తి చిచ్చు రగిలింది. మొదటి భార్య మరణానంతరం, సోమరాజు రాఘవమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరుగురు కుమార్తెలు జన్మించారు. అయితే, సోమరాజు మొదటి భార్య కుమారుడు సత్యనారాయణ కన్ను తాతలు సంపాదించిన వంశపారంపర్య ఆస్తిపై పడింది. తండ్రి రెండో వివాహాన్ని, ఆ ద్వారా పుట్టిన తన సోదరీమణులను గుర్తించేందుకు సత్యనారాయణ నిరాకరించడమే కాకుండా, వారిని వివాహేతర సంబంధం ద్వారా పుట్టిన వారుగా చిత్రీకరిస్తూ కోర్టులో కేసు వేశారు. Divorce: ఆ రూల్ ఇక తప్పనిసరి కాదు..హైకోర్టు సంచలన తీర్పు!కోర్టు ముందు డ్రామా.. కానీ..!తమకు ఆస్తిలో వాటా కావాలని కోరుతూ సోమరాజు, ఆయన రెండో భార్య కుమార్తెలు వేసిన దావాను తప్పుపట్టిన సత్యనారాయణ, ఒక అడుగు ముందుకేసి.. తన తండ్రి ఆస్తి హక్కులను రూ. 80 వేలకే వదులుకున్నారని కొత్త డ్రామాకు తెరలేపారు. తండ్రి ఆస్తిని వదులుకున్నాడంటే, ఇక కుమార్తెలకు ఆస్తిలో వాటా ఎక్కడిది? అన్నది సత్యనారాయణ వాదన. తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తిని, తన వారసత్వ హక్కులను కాపాడుకోవడానికి ఆ ఆరుగురు కుమార్తెలు కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాల్సి వచ్చింది. కూతురికి తెలియకుండా తండ్రి ఆస్తి అమ్మేస్తే.. కోర్టుకు వెళ్లొచ్చా?హైకోర్టు సంచలన తీర్పుఇరుపక్షాల వాదనలను సునిశితంగా పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు, సత్యనారాయణ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఒక తండ్రి తన హక్కులను వదులుకున్నాడంటే, అది ఆయన వ్యక్తిగత వాటాకు మాత్రమే పరిమితం. అది కన్నబిడ్డల హక్కులను కాలరాయలేదు అని స్పష్టం చేశారు. ఆ ఆరుగురు కుమార్తెలు సోమరాజుకు చట్టబద్ధమైన సంతానమేనని ధృవీకరించిన కోర్టు, వారికి ఆస్తిలో సమాన వాటా దక్కాల్సిందేనని తేల్చిచెప్పింది.తండ్రిని, సోదరీమణులను అవమానిస్తూ దాఖలు చేసిన సత్యనారాయణ అప్పీల్‌ను కొట్టివేస్తూ, కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో రెండో వివాహం చేసుకున్న వారి సంతానం హక్కుల గురించి మళ్ళీ చర్చకు తెరలేపింది. నిజాయితీ గెలిచిందని, ధర్మం నిలబడిందని ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.