
దేశంలో బంగారం కొనుగోళ్లు తగ్గడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. తాను ఇచ్చిన పిలుపు తర్వాత ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించారని చెప్పారు. మన్‌కీబాత్ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.
యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. యువత క్రీడలను కెరీర్‌గా ఎంచుకొని కష్టపడాలన్నారు. ఈ సందర్భంగా నాగాలాండ్‌లోని చిన్నారుల ఫుట్‌బాల్ లీగ్‌ను ప్రస్తావించారు. నగరాల్లో ద్విచక్రవాహనాలు, కార్ల వినియోగం తగ్గించాలని సూచించారు. దేశంలో పర్యావరణాన్ని పరిరక్షించే పక్షులను రక్షించుకోవాలని కోరారు. నా పిలుపుతో బంగారం కొనుగోళ్లు తగ్గాయి: మోదీ |