
ఇంటర్నెట్డెస్క్: ప్రైవేటు టూర్ ఆపరేటర్లపై ఆధారపడి కైలాస్-మానస్ సరోవర్ యాత్ర (Kailash-Manasarovar Yatra)కు వెళ్తున్న భారతీయ పౌరులను ఉద్దేశించి విదేశాంగ శాఖ అడ్వైజరీ చేసింది.
ఈ మొత్తం ప్రయాణాన్ని పూర్తి చేయడానికి అవసరమైన అన్ని పత్రాలు పొందిన తర్వాతే భారత్ నుంచి బయల్దేరాలని సూచించింది. చైనాలోకి ప్రవేశించడానికి అవసరమైన పర్మిట్, వీసాలు లేకుండా.. ప్రైవేటు టూర్ ఆపరేటర్లను నమ్మి వెళ్లి.. పలువురు భారతీయులు నేపాల్లో చిక్కుకుపోయారు. సహాయం చేయాలంటూ వారి నుంచి అభ్యర్థనలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం నుంచి స్పందన వచ్చింది. యాత్ర ప్రారంభించడానికి ముందు టూర్ ఆపరేటర్ వివరాలను ధ్రువీకరించుకోవాలని సూచించింది. కరోనా వల్ల ఐదు సంవత్సరాలు ఈ యాత్రకు అంతరాయం ఏర్పడగా.. గత ఏడాదే పునఃప్రారంభమైంది. ఈ ఏడాది జూన్ 20న తొలిబ్యాచ్ నాథులా పాస్ మీదుగా చైనాలోకి ప్రవేశించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
పెళ్లి పత్రికల సేకరణతో గిన్నిస్ రికార్డు సాధించిన కేరళ వాసి.. తన కుమారుడి వివాహానికి వినూత్నమైన శుభలేఖను ఎంచుకున్నారు.