
ఇంటర్నెట్‌డెస్క్: ముంబయిలో శుక్రవారం మొహర్రం రోజు దాదాపు 15,000 మందికి ఎలుకల మందు పెట్టాలన్న కుట్ర ఓ సాధరాణ మహిళకు వచ్చిన అనుమానంతో భగ్నమైంది. ఇప్పటికే కుట్రదారు
డు ఫయాజ్ ప్రేమ్‌జీని పోలీసులు అదుపులోకి తీసుకొని ఎలుకల మందు (జింక్ పాస్ఫేట్) నింపిన 15,000 క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
నిందితుడు ఫయాజ్ ఈ విషపూరిత క్యాప్సూల్స్‌తో మహిళలనే ఎక్కువగా టార్గెట్ చేసుకోవాలని భావించాడు. తొలుత నొప్పి నివారణ మందులు, ఇమ్యూనిటీ బూస్టర్లంటూ కొందరికి పంచాడు. ఆ తర్వాత ‘చాక్లెట్లు’ అని చెప్పి జనాలపైకి విసిరాడు.
రేయ్ రోడ్ రహ్మతాబాద్ శ్మశానం వద్ద అతడు ఉచితంగా క్యాప్సూల్స్ పంచడంపై ఓ మహిళకు అనుమానం వచ్చింది. దానిని తెరిచి చూడగా అసాధారణ పౌడర్ వంటింది ఉండటంతో బైకుల్లా పోలీసులకు సమాచారం ఇచ్చింది. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు ఫయాజ్ను అరెస్టు చేసి.. 14,900 క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే 11 మంది వాటిని తిని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. తాను 15,000 మందిని చంపాలనుకున్నట్లు ఫయాజ్ పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది.
జింక్ పాస్ఫేట్‌ను మనిషి తిన్నప్పుడు అది శరీరంలోని ఆమ్లాలతో చర్య జరిపి.. పాస్ఫేట్ గ్యాస్ విడుదల చేస్తుంది. ఇది గుండె, ఊపిరితిత్తులు, లివర్, బ్రెయిన్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ విషానికి యాంటీ డోట్ కూడా లేదని నిపుణులు చెబుతున్నారు. నిందితుడు దాదాపు 50 కిలోల జింక్ పాస్ఫేట్, 30 ఖాళీ క్యాప్సూల్స్‌ను కొనుగోలు చేసినట్లు తేలింది. అతడే ఓ గెస్ట్‌హౌస్‌లో వీటిని నింపినట్లు భావిస్తున్నారు.
నిందితుడు ఫయాజ్ ఉన్నత విద్యావంతుడు. బీబీఏ చేసి కొన్నాళ్లు తన తండ్రి ఫ్యాక్టరీలో పనిచేశాడు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లాడు. ఇరాన్, ఇరాక్‌లో ఉన్నాడు. ప్రస్తుతం అతడి కుటుంబం ఇరాన్లో ఉంటున్నట్లు సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
పెళ్లి పత్రికల సేకరణతో గిన్నిస్ రికార్డు సాధించిన కేరళ వాసి.. తన కుమారుడి వివాహానికి వినూత్నమైన శుభలేఖను ఎంచుకున్నారు.