
భారత అథ్లెటిక్స్ హిస్టరీలో ఒక హిస్టారికల్ మూమెంట్ నమోదైంది. కేరళకు చెందిన 25 ఏళ్ల స్టార్ లాంగ్ జంపర్ ఆన్సీ సోజన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
ఇండియాకు దొరికిన కొత్త లాంగ్ జంప్ క్వీన్ గా ఆమె నిలిచింది. దిగ్గజ అథ్లెట్ అంజు బాబీ జార్జ్ పేరు మీద 22 ఏళ్లుగా ఉన్న నేషనల్ రికార్డును ఆన్సీ ఇప్పుడు బద్దలు కొట్టింది.
భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన 'నేషనల్ ఇంటర్-స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026'లో ఆన్సీ సోజన్ ఈ అద్భుతమైన ఫీట్ సాధించింది. గ్రౌండ్లో ఏకంగా 6.88 మీటర్ల దూరం దూకి రికార్డుల మోత మోగించింది. గతంలో భారత్‌కు చెందిన లెజెండ్రీ అథ్లెట్ అంజు బాబీ జార్జ్ 2004 ఎథెన్స్ ఒలింపిక్స్‌లో 6.83 మీటర్ల దూరం దూకి ఈ నేషనల్ రికార్డును సెట్ చేశారు. గత 22 ఏళ్లుగా ఏ ఒక్క ఇండియన్ విమెన్ అథ్లెట్ కూడా కనీసం ఈ రికార్డు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. కానీ, ఆన్సీ సోజన్ తాజాగా ఆ పాత రికార్డును బద్దలు కొట్టింది.
ఈ కాంపిటీషన్లో ఇండియన్ నేవీ కి ప్రాతినిధ్యం వహించిన ఆన్సీ సోజన్, గేమ్ స్టార్టింగ్ నుంచే ఫుల్ ఫామ్‌లో కనిపించింది. తన ఐదో ప్రయత్నంలో ఏకంగా 6.88 మీటర్ల దూరాన్ని కవర్ చేసి సరికొత్త రికార్డుతో చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది జరగబోయే 'వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్' కంటే ముందే ఆన్సీ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో, వరల్డ్ లెవెల్లో భారత్‌కు పతకం వచ్చే ఛాన్సులు భారీగా పెరిగాయి.
ఈ 6.88 మీటర్ల హిస్టారికల్ పర్ఫార్మెన్స్తో ఆన్సీ సోజన్ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ తన పవర్ ఏంటో చూపించింది. ఆసియా అథ్లెటిక్స్ హిస్టరీలోనే ఆల్‌టైమ్ బెస్ట్ విమెన్ లాంగ్ జంపర్ల లిస్ట్‌లో ఆమె 8వ స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు, గత 20 ఏళ్ల హిస్టరీలో ఆసియా వ్యాప్తంగా 6.85 మీటర్ల కంటే ఎక్కువ దూరం దూకిన రెండో విమెన్ అథ్లెట్‌గా ఆన్సీ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
ఆన్సీ సాధించిన ఈ అద్భుతమైన సక్సెస్ వెనుక ఒక ఎమోషనల్ స్ట్రగుల్ స్టోరీ ఉంది. గతేడాది ఆమె తీవ్రమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యతో బాధపడింది. దీనివల్ల ఆమె బరువు చాలా వేగంగా పెరిగిపోయింది. ఒక లాంగ్ జంప్ అథ్లెట్‌కు పెరిగిన బరువుతో రన్‌వే మీద అంత స్పీడ్‌గా పరిగెత్తడం, టేకాఫ్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది చాలా కష్టమైన టాస్క్.
బరువు తగ్గడం ఆన్సీకి చాలా పెద్ద ఛాలెంజ్‌గా మారిన టైమ్‌లో ఆమె కోచ్ అండగా నిలిచారు. ఆ కష్ట కాలం గురించి ఆన్సీ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయింది. "మనం స్పోర్ట్స్ లో హయ్యస్ట్ లెవెల్లో పర్ఫార్మ్ చేయాలంటే త్యాగం, క్రమశిక్షణ చాలా ముఖ్యం. నా కష్ట కాలంలో మా కోచ్ అనూప్ జోసెఫ్ నాకు ఇదే చెప్పారు. మేము మా ట్రైనింగ్, డైట్లో చాలా కఠినమైన మార్పులు చేశాం. ఆ హార్డ్ వర్క్ వల్లే ఈరోజు మైదానంలో కొత్త నేషనల్ రికార్డు సాధ్యమైంది" అని ఆన్సీ చెప్పుకొచ్చింది.
25 ఏళ్ల ఆన్సీ సోజన్ కెరీర్ గ్రాఫ్ చూస్తే ఆమె క్రమంగా సక్సెస్ మెట్లు ఎక్కుతూ వస్తోంది. రీసెంట్ టైమ్స్‌లో ఆమె కన్సిస్టెంట్గా పతకాలు గెలుస్తోంది. 2023 ఏషియన్ గేమ్స్‌లో ఆమె సిల్వర్ మెడల్ సాధించింది. ఆ తర్వాత 2025 ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోనూ సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ఇక 2026 లో రాంచీలో జరిగిన ఫెడరేషన్ కప్‌లో 6.76 మీటర్ల దూరం దూకి ఏషియన్ గేమ్స్ క్వాలిఫికేషన్ మార్క్‌ను రీచ్ అయింది. ఇప్పుడు లేటెస్ట్గా 2026 ఇంటర్-స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా 6.88 మీటర్లతో గోల్డ్ మెడల్ నెగ్గడమే కాకుండా, సరికొత్త నేషనల్ రికార్డును కూడా క్రియేట్ చేసింది.