
Mercury Transit Until July 23: జూలై 23వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి బుధుడి అశుభ ప్రభావం పడుతుంది. ఈ సమయంలో వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
ముఖ్యంగా వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో ఎన్నో రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Mercury Transit Until July 23 Telugu: జూన్ 29వ తేదీ నుంచి జూలై 23వ తేదీ వరకు కర్కాటక రాశితో పాటు మిథున రాశిల్లో గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో మేధస్సుతో పాటు వ్యాపారం, కమ్యూనికేషన్‌కు సూచికగా భావించే బుధుడు ఈ సమయంలో సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆయా రాశుల వారికి ఈ సమయాల్లో అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి..
బుధుడి ప్రభావంతో జూలై 23వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి ఈ సమయం అంతగా ఉండకపోవచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందులతో పాటు అనేక రకాల సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కోరుకుంటున్న కోరికలు కూడా నెరవేరకపోవచ్చు. అంతేకాకుండా ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా ఈ క్రింది రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
బుధుడి ప్రభావంతో మిథున రాశి వారిపై ఊహించని ప్రభావం పడబోతోంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు అకస్మాత్తుగా విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాట్లాడే క్రమంలో తప్పకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించడం చాలా మంచిది.. ఇతరులతో పెద్దవారితో కఠినమైన మాటలు మాట్లాడకపోవడం మంచిది..
బుధుడు వక్రగతిలో ఉండడం కారణంగా ధనస్సు రాశి వారికి కూడా ఆశించిన ఫలితాలు కలగకపోవచ్చు. అంతేకాకుండా ఒత్తిడితోపాటు అనవసరమైన ఆందోళనలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలోచించు వ్యాపారాలు చేయడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. లేకపోతే ఈ సమయంలో ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
బుధుడి ప్రభావంతో వృషభ రాశి వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీడియాతో పాటు మార్కెటింగ్ రచన సోషల్ మీడియా రంగాల్లో ఉన్నవారు తప్పకుండా అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే క్రమంలో తప్పకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. అంతేకాకుండా తరచుగా తీవ్ర సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులందరికీ ఈ సమయం కొంత కష్ట కాలంగానే ఉంటుంది..
బుధుడి తిరోగమనం దాదాపు 25 రోజుల పాటు ఉండబోతోంది కాబట్టి ఈ సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. అంతేకాకుండా ప్రాజెక్టులో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అలాగే ప్రాజెక్టులకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేయకపోవడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.