
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Telangana Folk Song: బాసింగ బాసింగ బలాలే భలేగున్నాయే.. చేతుల జిలకర బెల్లాలే కలిసున్నాయే..!! ఈ పోరడి నిలువెత్తు ప్రాణాలే నాలో ఉన్నాయే.. శ్రావణ మాసపు బలాలే సై అన్నాయే..!! బాసింగ బాసింగ బంగారు బొమ్మలే.. చూసినోళ్ల కళ్లల్లో నీ వెంట పరుగులే.. ఈ జన్మలోనా జీవితమే పండుగలే..!!
అటో డజాను.. ఇటో డజాను.. గాజులు వేపిస్తా పిల్ల.. నీ నుదిటిన బాసింగం కట్టి.. నా ఇంటికి తీసుకెళ్తా పిల్ల..!! పెళ్లి పందిట్లోన పెండ్లి కొడుకై నేను కూర్చుంటే.. నా పక్కన చేరి సిగ్గుల మొగ్గవు నువ్వవుతుంటే.. ఈడు జోడు కలిసిన వేళా.. మన బంధం గట్టిపడతా ఉంటే.. వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్లు వేస్తుంటే..!! బాసింగ బాసింగ బలాలే భలేగున్నాయే.. చేతుల జిలకర బెల్లాలే కలిసున్నాయే..!!
తెలంగాణ అంటేనే ఫోక్ సాంగ్స్.. ఫోక్ సాంగ్స్ అంటేనే తెలంగాణ. ఎప్పటికప్పుడు సరికొత్తగా వచ్చే తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో యూట్యూబ్ షేక్ అవుతూనే ఉంటుంది. ఇప్పటికే వందలాది పాటలు ఓ రేంజ్ లో దుమ్ముదురేపాయి. కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన ఈ పెళ్లి పాట మాత్రం కొన్నేండ్ల వరకు యాదికుంటుంది. ఈ పాట విడుదలైన రెండు రోజుల్లోనే యూట్యూబ్ ను షేక్ చేసిందంటే.. ఈ పాటకున్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఈ పాట చూస్తున్నంత సేపు నిజంగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పెళ్లి కబర్లు చెబుతున్నట్లుగానే అనిపిస్తుంది.
తెలంగాణ బీట్ తో ఈ పాట మొదలవుతుంది. ఆ బీట్ లో ఎంగేజ్ మెంట్, తర్వాత పెళ్లికి సంబంధించి ఒక్కో ఘట్టాన్ని ఎంతో అద్బుతంగా చూపించారు. అటో డజను.. ఇటో డజను గాజులు తొడుగుతుండగా అనే లిరిక్స్ నిజంగా ప్రతి అక్క చెల్లెమ్మ గుండెలకు అతుక్కుపోయింది. నుదిటికి పెళ్లి బాసింగాలే.. అనే లైన్ ప్రతిఒక్కరి పెళ్లి రోజులు గుర్తుకు తెస్తుంది. ఆ మ్యూజిక్ వింటుంటే మనం కూడా ఎగిరిగంతేయ్యాలనిపిస్తుంది.
ఇక ఇప్పుడు ఈ పాట ఇన్ స్ట్రాగ్రామ్ లోనూ దుమ్ములేపుతోంది. ఎవరూ చూసిన అటో డజాను.. ఇటో డజాను.. గాజులు వేపిస్తా పిల్ల..నీ నుదిటిన బాసింగం కట్టి.. నా ఇంటికి తీసుకెళ్తా పిల్ల..!! బాసింగ బాసింగ బలాలే భలేగున్నాయే..అంటూ స్టెప్పులు వేస్తూ అదరగొడుతున్నారు. ఒక్క పాటలో తెలంగాణ ట్రెడిషన్ అంతా చూపించారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట్లోట్రెండింగ్గా మారింది. స్వామినరేశ్, శ్రీనిధి నెరెళ్ల పాడిన ఈ పాట..నిజంగా మనస్సును హత్తుకుంది. కల్యాణ్ కీస్ మ్యూజిక్ ఈ పాటకు హైలైట్ గా నిలిచింది.
తెలంగాణ లగ్గం, పసుపులు ముట్టడం, మంగళ స్నానాలు, తలంబ్రాల ముచ్చట్లను కళ్లకు కట్టినట్లు చూపించింది ఈపాట. ఈ మాస్ జానపద గీతం సోషల్ మీడియాలో రీల్స్ తో దుమ్మురేపుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.