
మాంచెస్టర్: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్ -2 నుంచి ఇంగ్లాండ్‌తోపాటు వెస్టిండీస్ సెమీస్‌కు చేరుకుంది. తన చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్ చేతిలో ఓడినా విండీస్‌కు అవకాశం రావడం గమనార్హం.
ఎందుకంటే ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ గెలిచి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ, కివీస్ ఓడిపోవడంతో రెండో స్థానంతో విండీస్ సెమీఫైనల్ బెర్తును దక్కించుకుంది.
వరుసగా 3 మ్యాచ్‌లు గెలిచి అలవోకగా సెమీస్ చేరేలా కనిపించిన వెస్టిండీస్.. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. గత మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు తలవంచిన విండీస్.. గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ చేరే మ్యాచ్‌లో చిన్న జట్టు ఐర్లాండ్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడింది. మొదట విండీస్ 128/7కే పరిమితమైంది. లక్ష్యాన్ని ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి అందుకుంది. ఓర్లా (63) ఐర్లాండ్‌ను గెలిపించింది. అయితే, గ్రూప్-2 చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవడంతో విండీస్ సెమీస్‌కు చేరుకుంది.
అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడి ఇంటిముఖం పట్టింది. తొలు బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 17.2 ఓవర్లలోనే కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి 164 పరుగులు చేసి విజయం సాధించింది.
మరోవైపు శ్రీలంక 3 వికెట్ల తేడాతో స్కాట్లాండ్పై గెలిచింది. మొదట స్కాట్లాండ్ 6 వికెట్లకు 151 పరుగులు చేసింది. సారా బ్రైస్ (47 నాటౌట్) టాప్‌స్కోరర్. లంక 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. గ్రూప్ B నుంచి ఇంగ్లాండ్, విండీస్ సెమీస్‌కు చేరుకోవడంతో.. న్యూజిలాండ్, కివీస్, స్కాట్లాండ్ ఇంటిముఖం పట్టాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.