
మనం ఇక్కడ ఉంటాం... కానీ మనసు ఎక్కడో ఉంటుంది. గతంలోని బాధలనో... భవిష్యత్తు గురించిన ఆశలనో తలపోస్తూ ఉంటుంది. దీనివల్ల విలువైన వర్తమానం చేజారిపోతుంది. ఇది సరికాదంటున్నారు
మనస్తత్వవేత్త మెరీనా అబ్రమోవిచ్. నిశ్చలత్వంతోనే జీవితం మరింత ఉత్సాహంగా మారుతుందని అంటారామె. దీనికోసం ‘ది ఆర్ట్ ఆఫ్ బీయింగ్ ప్రజెంట్’ అనే కోర్సును రూపొందించారు. చంచలమైన మనసును అదుపులో పెట్టడానికి.. వర్తమానంలో ఉండడానికి అందులో కొన్ని అభ్యాసాలు సూచించారు.
నిశ్చలత్వం అంటే మనసును ఖాళీ చేయడం కాదు. మనల్ని మనం గమనించుకోవడం. గుండె చప్పుడు, శ్వాస, రక్తప్రసరణ ఇలా ప్రతిదాన్నీ అనుభూతి చెందడం. దీని వల్ల నిమిషాల వ్యవధిలో వర్తమానంతో అనుసంధానమవుతాం.
ఇక్కడ మనం శ్రద్ధపెట్టేది నీటిపై కాదు... చర్యపై. దీని వల్ల నీరు తాగిన క్షణాలన్నిటిపై మనకు పూర్తి అవగాహన ఉంటుంది. అంటే ఆ కాలం మన అధీనంలోకి వచ్చినట్టే.
మనం చేసే పనులు వేగంగా ఉంటే... మన జీవితం కూడా వేగంగా ముందుకు వెళ్లిపోతుంది. వర్తమానంతో మనం అనుసంధానం కావాలంటే మన చర్యలను కాస్త నెమ్మదింపజేయాలి. అదే ఈ నడకలోని కాల రహస్యం.
మన శ్వాసలను నెమ్మదింపజేస్తే... ఆలోచనల వేగాన్ని, సంఖ్యను కూడా తగ్గించుకోగలుగుతాం. దీనికి ఈ సరళమైన ప్రక్రియ చాలా ఉపయోగపడుతుంది.
మన మెదడులో భావోద్వేగ స్తబ్దత ఏర్పడినప్పుడు అనేక రకాల ఆలోచనలు మనల్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. జుట్టు, తలపై మృదువైన మర్ధన ద్వారా ఆ స్తబ్దతను తొలగించి మనసును చైతన్యవంతం చేయగలుగుతాం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.