
తిరుమల: తితిదేకు అనంత్ అంబానీ భారీగా విరాళాలు ప్రకటించారు. 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. 50 మంది బస్సు డ్రైవర్ల జీతభత్యాలు చెల్లించనున్నట్లు చెప్పారు.
గుజరాత్లోని వంతారాలో ఉన్న తితిదే గోశాల ఆధునికీకరణకు కూడా అంగీకారం తెలిపారు. తిరుమలలో ఛార్జింగ్ స్టేషన్ను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇవాళ వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో అనంత్ అంబానీ పాల్గొన్నారు. తితిదేకు అనంత్ అంబానీ భారీ విరాళాలు |