
మటన్ పాయా సూప్ రుచి మామూలుగా ఉండదు. కుక్కర్లో దీన్ని సులభంగా తక్కువ సమయంలో మంచి రుచితో వండేసుకోవచ్చు. ఎముకల సమస్యలు ఉన్న వారికి మటన్ పాయా అద్భుతమైన వంటకం. దీనిలో ఉండే పోషకాలు ఎముకలను బలంగా మారు
స్తాయి. ఇక మటన్ పాయా కుక్కర్లో ఎలా వండాలో తెలుసుకోండి.
1. మటన్ పాయాలను వేడి నీటిలో బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.ప్రెషర్ కుక్కర్లో నూనె లేదా నెయ్యి వేసి వేడిచేయాలి.
2. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
3. ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి.
4. శుభ్రం చేసుకున్న పాయా ముక్కలను కుక్కర్లో వేసి, 2 నిమిషాలు మసాలా పట్టేలా వేయించాలి.
5. తర్వాత 4 నుండి 5 కప్పుల నీళ్లు పోసి, గరం మసాలా, మిరియాల పొడి వేసి కలపాలి.
6. కుక్కర్ మూత పెట్టి, మీడియం మంటపై 10 నుండి 12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి
7. కుక్కర్ ప్రెజర్ మొత్తం తగ్గిపోయాక మూత తీసి, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా చల్లి వేడివేడిగా సర్వ్ చేయాలి.