
భరించలేనంత తలనొప్పి కనిపించని శత్రువు ఒకవైపు నుంచే సుత్తితో బాదేస్తున్నంత బాధ ఐదు నిమిషాలో పది నిమిషాలో అయితే తట్టుకోగలం. కానీ, ఆ హింస అక్కడితో ఆగిపోదే. గంటల తరబడి కొనసాగుతుంది.
మైగ్రెయిన్ తత్వమే అంత. పార్శ్వనొప్పిగానూ పిలిచే ఈ జగమొండి వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మందిని వేధిస్తున్నట్టు అంచనా. ఆ లక్షణాలు గుర్తుకొచ్చినా తల బరువెక్కి పోతుంది. ఇక తీవ్రరూపం ధరిస్తే... నరకమే. మైగ్రెయిన్ను నిద్రపుచ్చడం తెలుసుకుంటే, సగం ‘తలనొప్పి’ తగ్గిపోయినట్టే. మైగ్రెయిన్‌తో.. మైండ్‌గేమ్ |