
Japan Earthquake| ఇంటర్నెట్‌డెస్క్: పలు దేశాలను కొన్నిరోజులుగా భూకంపం వణికిస్తోంది. ఆదివారం ఉదయం జపాన్‌లో మరోసారి భూమి కంపించింది. ఆ తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైంది.
అమోరి ప్రిఫెక్చర్ సమీపంలో 40 కి.మీలోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ వాతావరణ విభాగం (JMA) వెల్లడించింది. ఈ ప్రకృతి విపత్తు వెనెజువెలాలో భారీ విధ్వంసాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జపాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం (Earthquake) వచ్చింది. మళ్లీ రోజుల వ్యవధిలో ఇలా ప్రకంపనలు రావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రకంపనలు రావొచ్చని జేఎంఏ హెచ్చరించింది. ప్రస్తుతం ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.