
'నాగబంధం' సినిమాలో గరుడ రామ్ పాత్ర చాలా భయంకరంగా ఉంటుంది. దానికోసం ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గంటల పాటు మేకప్ వేసుకునేవారు. రాత్రంతా ఆయనపైనే షూటింగ్ జరిగేది.
ఆ సమయంలో ఆయనకు తిండి, నిద్ర సరిగ్గా ఉండేవి కావు.
ఈ మాటలు రామ్ చెప్పినవి కాదు. 'నాగబంధం' సినిమా హీరోగా నటించిన విరాట్ కర్ణ వెల్లడించారు. ఈ చిత్రంలో గరుడ రామ్ 'బైరాగి' అనే పాత్రను పోషించారు.ఈ క్యారెక్టర్ కోసం ఆయన ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని విరాట్ కర్ణ వివరించారు.
ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం రహస్యమైన 'నాగబంధం' తో పాటు హిమాలయాల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది.