
భార్యకు మత్తుమందు ఇచ్చి, రెండు దశాబ్దాలుగా అనేకమంది పురుషులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడో భర్త. బ్రిటన్‌లో జరిగిన ఈ దారుణ ఘటన తాజాగా వెలుగు చూసింది. గ్రేటర్ మాంచెస్టర్‌కు చెంది
న అరవై ఏళ్ల పైబడిన వృద్ధుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇతరుల పేర్లను వెల్లడించకుండా గతంలో ఉన్న ఆంక్షలను కోర్టు తొలగించడంతో ఈ ఉదంతం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.ప్రధాన నిందితుడైన భర్త గుర్తింపును, బాధితురాలైన అతడి భార్య భద్రత, గోప్యత నిమిత్తం చట్టప్రకారం గోప్యంగా ఉంచారు. అయితే, అతడు తన భార్యపై జరిగిన 15 లైంగిక నేరాలకు సంబంధించి ఇప్పటికే నేరాన్ని అంగీకరించాడు. ఇందులో ఐదు అత్యాచారాలు, మూడు లైంగిక వేధింపులు, ఆరు దారుణమైన దాడులు, భార్య అనుమతి లేకుండా ప్రైవేట్ చిత్రాలను ఇతరులతో పంచుకున్న నేరాలు ఉన్నాయి. మిగిలిన 33 ఆరోపణలను అతడు తోసిపుచ్చాడు. 2004 నుండి గత ఏడాది అతడు అరెస్ట్ అయ్యే వరకు ఈ ఘోరాలు సాగాయని, భార్య స్పృహలో లేని సమయంలో సహ నిందితులను పిలిపించి ఈ దాడులకు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ పేర్కొంది.బయటపడ్డ నిందితుల పేర్లునిందితుల వివరాల వెల్లడిపై ఉన్న ఆంక్షలను కోర్టు ఎత్తివేయడంతో, 28 నుండి 73 ఏళ్ల వయసున్న 13 మంది సహ నిందితుల పేర్లు ఇప్పుడు బహిరంగమయ్యాయి. వీరిపై ఉమ్మడి కుట్ర, సామూహిక దాడులకు పాల్పడటం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది ఈ దారుణాల్లో నేరుగా పాల్గొనగా, మరికొందరు ఇంటర్నెట్ వేదికగా ఈ అకృత్యాలను ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.నిందితులు