
హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): మహిళలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడు నాగతేజ అలియాస్ నానిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. నింది
తుడు సోషల్ మీడియా వేదికలైన స్నాప్‌చాట్ తదితర యాప్‌ల ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని, వారిని నమ్మించి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించేవాడని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు పరిచయమైన మహిళలను లోబర్చుకుని, వారి ఫొటోలు, వీడియోలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ నెలలో డీఎల్ఎఫ్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ గదిలో మహిళను కత్తితో బెదిరించి ఆమెకు సంబంధించిన నగ్న వీడియోలను రికార్డు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరించి సుమారు రూ.1.10 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమయంలో నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తలు కూడా చదవండి... తెలంగాణ రైజింగ్ విజన్‌కు ప్రపంచ దిగ్గజ కంపెనీల మద్దతు: సీఎం రేవంత్ రెడ్డి సీషెల్స్ పర్యటనలో గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ Read Latest Telangana News And AP News And National News And Telugu News తెలంగాణ రైజింగ్ విజన్‌కు ప్రపంచ దిగ్గజ కంపెనీల మద్దతు: సీఎం రేవంత్ రెడ్డి సీషెల్స్ పర్యటనలో గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ