
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Ravi Teja Crazy Project: మాస్ మహారాజా రవితేజ.. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోయేవాడు. కానీ ఈ మధ్యకాలంలో రవితేజ వరుస ఫ్లాపులతో అది ఆయన మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గతేడాది విడుదలైన ‘మాస్ జాతర’,.. ఆ తర్వాత ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలు పెద్దగా అలరించలేకపోయాయి. దీంతో రూట్ ఛేంజ్ చేసి తన ఇమేజ్‌కు భిన్నమైన కథతో రాబోతున్నాడు.
డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఇరుముడి' సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫినిషింగ్‌లో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాను ఆగష్టులో కాకుండా నవంబర్ లేదా డిసెంబర్లో విడుదల చేస్తే అయ్యప్ప స్వాముల ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్‌పై ఉండగానే మాస్ రాజా తన నెక్స్ట్ పవర్‌ఫుల్‌గా సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిలిం నగర్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, 'ఇరుముడి' తర్వాత రవితేజ డైరెక్టర్ మారుతీతో తర్వాత సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రభాస్ వంటి స్టార్ హీరోకు అతని కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడిగా చరిత్రకు ఎక్కాడు. ఇక రెబల్ స్టార్ అభిమానులు కూడా మారుతి కనిపిస్తే కొట్టేలా ఉన్నారు.
మారుతికి ముఖం చాటేస్తున్న హీరోలు.. ఇక మారుతికి కూడా వేరే హీరోలు నమ్మి సినిమాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో దర్శకుడిగా తాను నిరూపించుకోవడానికి ఓ హీరో కావాలి. మరోవైపు రవితేజతో మీడియం రేంజ్ దర్శకులు కూడా సినిమాలు చేసే పరిస్థితిలో లేరు. ఇలా ఫ్లాపుల్లో ఉన్న హీరో, దర్శకుడి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాతో వీళ్లిద్దరు హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ రకంగా ఇద్దరికి ఈ సినిమా విజయం అనేది కీలకం అని చెప్పాలి.
ఫ్లాపుల్లో రవితేజ.. రీసెంట్గా మారుతీ ఇటీవల రవితేజకు ఒక అదిరిపోయే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లైన్‌ను వినిపించారట. మారుతీ మార్క్ కామెడీ టైమింగ్, రవితేజ బాడీ లాంగ్వేజ్ అండ్ మాస్ ఎనర్జీకి సరిగ్గా సరిపోయేలా ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ అండ్ యాక్షన్‌గా ఈ సినిమా స్క్రిప్ట్ ఉండనున్నట్టు సమాచారం. నిజానికి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని గత 3, 4 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇద్దరి బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరలేదు. ప్రస్తుతం ఇద్దరూ కూడా బ్యాడ్ టైమ్‌ను ఫేస్ చేస్తున్నారు. ఇద్దరికీ కీలకమైన ఈ సమయంలో దొరకడంతో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చబోతుంది.
ఈ ప్రాజెక్ట్‌తో పాటు రవితేజ లైనప్‌లో మరికొన్ని క్రేజీ కాంబినేషన్లు కూడా లైన్లో ఉన్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో హాసిత్ గోలి డైరెక్షన్లో ఓ సినిమాకు ఓకె చెప్పినట్టు సమాచారం. అటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వివేక్ ఆత్రేయతో మరో సినిమా చర్చల దశలో ఉన్నట్టు సమాచారం. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరి కూడా రవితేజ కోసం ఒక పవర్ఫుల్ మాస్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు సమాచారం. ఇక తమిళంలో హరి నమ్మి సినిమాలు ఇచ్చే పరిస్థితులు లేవు. ఏది ఏమైనా మారుతీ మార్క్ కామెడీ టైమింగ్, రవితేజ ఎనర్జీ తోడైతే థియేటర్లలో నవ్వుల జాతర గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.