
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 1, 2, 3 తేదీల్లో ఒకేసారి రెండు మహాయోగాలు ఏర్పడనున్నాయి. మకర రాశిలో సంచరిస్తున్న చంద్రుడు, ఏడో ఇంట్లో ఉన్న గురుడితో కలిసి గజకేసరి యోగాన్ని ఏర్పరచనున్నాడు.
అలాగే అక్కడే ఉన్న బుధ, శుక్రులతో కలిసి ధనలక్ష్మి యోగాన్ని ఏర్పరచనున్నాడు. ఈ రెండు యోగాల ప్రభావంతో 6 రాశులవారికి మేలు జరగనుంది. వారు పట్టిందల్లా బంగారం కానుంది. మరి ఆ రాశులేవో తెలుసుకోండి.
మేష రాశివారికి నాలుగో ఇంట్లో ఉన్న గురు, శుక్ర, బుధ గ్రహాలు పదో ఇంట్లో ఉన్న చంద్రుడిని చూస్తున్నాయి. దీనివల్ల వీరికి రాజయోగం, ధనలక్ష్మి యోగం పట్టనుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. కెరీర్, ఉద్యోగాల కోసం వేరే దేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. శాలరీలు పెరుగుతాయి. కొన్ని పెట్టుబడుల్లో ఊహించని లాభాలు వస్తాయి.
కర్కాటక రాశివారికి ఉచ్ఛస్థితిలో ఉన్న గురు, బుధ, శుక్రులను ఏడో ఇంట్లో ఉన్న చంద్రుడు చూస్తున్నాడు. దీంతో వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయం భారీగా పెరుగుతుంది. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మనసులోని చాలా కోరికలు నెరవేరుతాయి. ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులు ఊహించని విదేశీ ఆఫర్లు పొందుతారు.
కన్య రాశివారికి ఐదో ఇంట్లో శుభ స్థానంలో ఉన్న చంద్రుడిని మూడు శుభ గ్రహాలు చూస్తున్నాయి. దీనివల్ల వీరికి గజకేసరి, ధనలక్ష్మి యోగాలు కలుగుతాయి. రాజపూజ్యం లభిస్తుంది. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. దేశ, విదేశాల్లో మంచి గుర్తింపు వస్తుంది. నైపుణ్యాలు పెరుగుతాయి. ఆదాయం భారీగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు.
తుల రాశి వారికి నాలుగో ఇంట్లో దిగ్బల రాజయోగాన్ని ఏర్పరుస్తున్న చంద్రుడిని పదో ఇంట్లో ఉన్న గురు, శుక్ర, బుధ గ్రహాలు చూస్తున్నాయి. దీనివల్ల వీరికి తిరుగులేని రాజయోగాలు, భాగ్య యోగాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఇల్లు, వాహనం కొనే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వృత్తి, ఉద్యోగంలోనే కాకుండా సమాజంలో కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. ఆదాయం భారీగా పెరుగుతుంది.
మకర రాశిలో ఉన్న చంద్రుడిని ఏడో ఇంట్లో ఉచ్ఛస్థితిలో ఉన్న గురు, బుధ, శుక్ర గ్రహాలు చూస్తున్నాయి. ఇది ఆర్థిక ఎదుగుదలకు, వేగవంతమైన ప్రగతికి గొప్ప అవకాశాలను ఇస్తుంది. రాజయోగాలు కలుగుతాయి. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. సెలబ్రిటీలతో పరిచయాలు పెరుగుతాయి. సాధారణ వ్యక్తి కూడా ధనవంతుడు అయ్యే అవకాశాలు వస్తాయి. మీరు కోరుకున్న శుభవార్త వింటారు.
మీన రాశి ఉచ్ఛ అధిపతి అయిన బుధుడు, శుక్రుడు... ఈ రాశికి శుభ స్థానంలో ఉన్న చంద్రుడిని చూస్తున్నారు. దీనివల్ల ఈ రాశి వారికి రాజయోగంతో పాటు సిరిసంపదలు, ధనధాన్య సమృద్ధి యోగం ఉంటుంది. మనసులోని చాలా కోరికలు నెరవేరతాయి, చింతలేని జీవితం లభిస్తుంది. వ్యాపారాలలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను వస్తాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.