
ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. అలాగే ఎప్పుడో దూరమైన వ్యక్తి మళ్లీ జీవితంలోకి ఎప్పుడు వస్తారో కూడా చెప్పలేం. కానీ ప్రతి ఏడాది జూన్‌లో మాత్రం కొత్త ప్రేమ మొదలవడమో..
లేక పాత భాగస్వామి నుంచి అనుకోకుండా మెసేజ్ రావడమో జరుగుతుంది అంటూ ఓ థియరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్నే ‘జూన్ థియరీ’ అంటున్నారు.ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్, ఎక్స్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ‘జూన్ థియరీ’పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీని ప్రకారం జూన్ నెలలో చాలా మందికి కొత్త ప్రేమ పరిచయం అవడమో... లేదంటే చాలా కాలంగా మాట్లాడని మాజీ ప్రియుడు లేదా మాజీ ప్రియురాలు అకస్మాత్తుగా సంప్రదిస్తారని నమ్ముతున్నారు.ఈ నమ్మకానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా.. జూన్‌లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చాలామంది తమ కథలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కొందరు ఈ నెలలోనే తమ ప్రేమ మొదలైందని చెబుతుండగా.. మరికొందరు నెలల తరబడి, ఏళ్ల తరబడి మాట్లాడని మాజీ భాగస్వామి నుంచి ఒక్కసారిగా మెసేజ్ వచ్చిందని అంటున్నారు.ఎందుకు జూన్?నిపుణుల అభిప్రాయం ప్రకారం దీనికి ప్రధాన కారణం వాతావరణం, జీవనశైలిలో వచ్చే మార్పులే. జూన్‌లో సెలవులు, విహారయాత్రలు, పెళ్లిళ్లు, స్నేహితుల సమావేశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో కొత్త వ్యక్తులను కలిసే అవకాశాలు పెరుగుతాయి. మనుషులు కూడా సాధారణ రోజుల కంటే ఎక్కువగా బయటకు వెళ్లడం, కొత్త పరిచయాలకు సిద్ధంగా ఉండటం వల్ల ప్రేమకు అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు.ఎక్స్‌లు ఎందుకు గుర్తొస్తారు?వేసవి కాలంలో చాలామంది పాత ఫొటోలు