
టెన్నిస్ ప్రపంచంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న నొవాక్ జొకోవిచ్, ఇప్పుడు వ్యాపార ప్రపంచంలోకి ఓ కీలక అడుగు వేశారు.
ప్రఖ్యాత గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ 'జనరల్ అట్లాంటిక్'కు గ్లోబల్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా వింబుల్డన్ బరిలోకి దిగడానికి కొద్ది రోజుల ముందు ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ కొత్త బాధ్యతల్లో భాగంగా జొకోవిచ్... జనరల్ అట్లాంటిక్ సంస్థ నాయకత్వ బృందంతో, దాని పోర్ట్‌ఫోలియో కంపెనీలతో, పెట్టుబడిదారులతో కలిసి పనిచేస్తాడు. ముఖ్యంగా నాయకత్వ పటిమ, స్థితిస్థాపకత, ఆవిష్కరణలు వంటి అంశాలపై తన అనుభవాలను, దృక్పథాన్ని పంచుకోనున్నాడు. ఈ నియామకం ద్వారా జొకోవిచ్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని, ముఖ్యంగా హెల్త్, వెల్నెస్ రంగంలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించాలని జనరల్ అట్లాంటిక్ భావిస్తున్నట్లు 'బ్లూమ్‌బెర్గ్' తన కథనంలో పేర్కొంది.ఇటీవలి కాలంలో జొకోవిచ్ వ్యాపార రంగంలో తన పెట్టుబడులను విస్తరిస్తున్నాడు. 2023లో వెల్నెస్ బ్రాండ్ 'వాటర్‌డ్రాప్'లో పెట్టుబడి పెట్టిన టెన్నిస్ స్టార్, 2024లో 'SILA' అనే సప్లిమెంట్ కంపెనీని సహ-స్థాపించాడు. 2025లో 'కాబ్ ఫుడ్స్' అనే స్నాక్ ఫుడ్ సంస్థను ప్రారంభించడంతో పాటు 'ఇంక్రిడివేర్' అనే వేరబుల్స్ కంపెనీకి కూడా మద్దతుగా నిలిచాడు.ఈ నియామకంపై జొకోవిచ్ స్పందిస్తూ.. "క్రీడల్లో అత్యున్నత స్థాయిలో రాణించడానికి అవసరమైన సూత్రాలే, గొప్ప వ్యాపారాలను నిర్మించడానికి కూడా వర్తిస్తాయి. క్రమశిక్షణ, దీర్ఘకాలిక ఆలోచనా విధానం, నిరంతరం మెరుగుపడాలనే తపన ఇరు రంగాల్లోనూ కీలకం. బిల్, ఆయన బృందం నిర్మిస్తున్న