గోరువెచ్చని నీటిలో పాదాలను నానబెట్టడం ద్వారా కాయలు మెత్తబడతాయి. అలాగే మృత చర్మ కణాలు తొలగిపోయి కాయలు తగ్గుతాయని AAD రీసెర్చ్ పేర్కొంది.
గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసి పాదాలను అందులో నానబెట్టిండి. లేదా ఈ మిశ్రమంతో పాదాలను క్లీన్ చేసుకోండి. దీనివల్ల కాయలు మెత్తబడి తగ్గిపోతాయి.
గోరువెచ్చని నీటిలో పాదాలను నానబెట్టిన తర్వాత ప్యుమిస్ స్టోన్‌తో కాయలపై నెమ్మదిగా మర్దన చేయండి. మరీ గట్టిగా చేస్తే రక్తం వస్తుంది. కాబట్టి నెమ్మదిగా మర్దన చేస్తే సరిపోతుంది.
కాయలు మెత్తబడి రాలిపోయేందుకు మాయిశ్చరైజర్ అప్లై చేయడం మంచిది. దీనికోసం కోకో బటర్, వాజిలిన్ వంటివి రాయొచ్చు. ఇవి కాయలను తొందరగా తగ్గిస్తాయి.
అలోవెరాలోని మాయిశ్చరైజింగ్ గుణాలు పాదాలకు అయిన కాయలు తగ్గించడంలో సహాయపడతాయి. దీనికోసం రాత్రి పడుకునే ముందు కాయలపై అలోవెరా రాయండి. ఉదయం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్‌లోని ఎసిడిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పాదాల కాయలు తగ్గించడంలో సహాయపడతాయి. దీనికోసం వెనిగర్‌లో కాటన్ ముంచి కాయలపై అద్దండి. తర్వాత బ్యాండేజీ వేయండి. రాత్రంతా ఉంచి ఉదయం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
ఆముదం నూనెలోని లూబ్రికెంట్ గుణాలు కాయలు మెత్తబడేలా చేసి తగ్గించడంలో సహాయపడతాయి. దీనికోసం రాత్రి పడుకునే ముందు ఆముదం నూనెను కాయలకు రాసి సాక్స్‌లు ధరించి పడుకుంటే మంచిది.
గోరువెచ్చని నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి పాదాలను నానబెట్టండి. ఇలా చేయడం వల్ల కాయలు మెత్తబడి తగ్గిపోతాయి. అలాగే పాదాల మురికి పోతుంది.
చెప్పులు, షూ నాణ్యమైనవి వాడండి. కింద గట్టిగా ఉంటే చర్మంపై ఒత్తిడి పెరిగి కాయలు అవుతాయి. అందుకే మీ పాదాలకు మంచి గాలి ఆడేలా ఉండేవి ఉపయోగించండి.