
టీమిండియా జెర్సీలో వైభవ్ సూర్యవంశీ (PC: BCCI X) టీమిండియాకు ఘోర అవమానం జరిగింది. ఐర్లాండ్ చేతిలో భారత జట్టు మొట్టమొదటిసారి పరాజయం పాలైంది.
Jun 27 2026 1:51 PM | Updated on Jun 27 2026 2:32 PM
టీమిండియా జెర్సీలో వైభవ్ సూర్యవంశీ (PC: BCCI X)
టీమిండియాకు ఘోర అవమానం జరిగింది. ఐర్లాండ్ చేతిలో భారత జట్టు మొట్టమొదటిసారి పరాజయం పాలైంది. బెల్ఫాస్ట్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో సమిష్టి వైఫల్యంతో టీమిండియా ఘోర పరాభవం మూటగట్టుకుంది.
ముఖ్యంగా ఐరిష్ బౌలర్ల దెబ్బకు టీమిండియా స్టార్ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. టాపార్డర్‌లో అభిషేక్ శర్మ (49) ఒక్కడు రాణించగా.. సంజూ శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (3) సైతం పూర్తిగా విఫలమయ్యాడు.
బెంచ్‌కే పరిమితం కాగా ఐర్లాండ్‌తో మ్యాచ్ సందర్భంగా భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అరంగేట్రం చేస్తాడనే ప్రచారం జరిగింది. అయితే, అనుభవానికే పెద్దపీట వేసిన యాజమాన్యం వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది. ప్రపంచకప్ గెలిచిన జట్టులోని సభ్యులను తప్పించలేమంటూ ఈ పదిహేనేళ్ల పిల్లాడికి మొండిచేయి చూపింది.
అయితే, ఐర్లాండ్ చేతిలో ఓటమి నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ తుదిజట్టులో ఉండి ఉంటే.. పరాభవం తప్పేదంటూ అభిమానులు పేర్కొంటున్నారు. అతడిని ఆడిస్తే ఫలితం వేరేలా ఉండేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో రాజస్తాన్ రాయల్స్ హెడ్‌కోచ్ కుమార్ సంగక్కర చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
నా దగ్గరకు వచ్చి కన్నుగీటి మరీ.. ‘‘లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్. మేము ముందుగా ఫీల్డింగ్ చేశాము. లక్నో విధించిన 220 పరుగుల లక్ష్యం ఛేదించాల్సి ఉంది. అప్పుడు వైభవ్ నడుస్తూ నా దగ్గరకు వచ్చి కన్నుగీటి మరీ.. ‘కోచ్. మీరేమీ ఆందోళన పడకండి. ఇది మనం చేసి తీరతాము’ అని చెప్పాడు.
నేను 13 సిక్సర్లు బాదతాను డ్రెసింగ్‌రూమ్‌లో డొనోవాన్ ఫెరీరా, లువాన్ డ్రి ప్రిటోరియస్ దగ్గరకు వెళ్లి.. ‘మీ ఇద్దరూ కాస్త వినండి. నేను ఈరోజు 13 సిక్సర్లు బాదబోతున్నాను. నేను నా పని పూర్తి చేసిన తర్వాత మీరు మిగతాది చూసుకోండి’ అని చెప్పాడు. అన్నట్లుగానే ఏకంగా పది సిక్సర్లు కొట్టాడు.
అతడు ఐదు సిక్సర్లు బాదిన తర్వాత డొనోవాన్, ప్రిటోరియస్ కింద కూర్చుని మరీ.. సిక్సర్లు లెక్కించడం మొదలుపెట్టారు. ఈ పిల్లాడు చెప్పింది చేసేట్లుగానే ఉన్నాడే అని ఆశ్చర్యపోయారు. వైభవ్ ఆత్మవిశ్వాసం అచంచలమైనది’’ అని సంగక్కర ‘స్కై స్పోర్ట్స్’తో వ్యాఖ్యానించాడు.
పదిహేనేళ్లకే ఆరెంజ్ క్యాప్ కాగా ఐపీఎల్-2026లో భాగంగా మే 19న జైపూర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఇన్నింగ్స్ బ్రేక్ సందర్భంగా.. ఈ ఘటన జరిగినట్లు సంగక్కర మాటల ద్వారా అర్థమైంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 38 బంతుల్లోనే ఏడు ఫోర్లు, పది సిక్సర్లు బాది 93 పరుగులు చేశాడు. రాజస్తాన్‌ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఇక మొత్తంగా ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ పదహారు మ్యాచ్‌లలో కలిపి 776 పరుగులు సాధించాడు. రాజస్తాన్ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. పదిహేనేళ్లకే ఆరెంజ్ క్యాప్ గెలిచి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే ఏకంగా టీమిండియాకు ఎంపికయ్యాడు.
చదవండి: చిన్న దేశం.. అతిపెద్ద విజయం.. సరికొత్త చరిత్ర
తెరపై నవ్వు.. తెర వెనుక విజన్.. భాగ్యరాజ్ అరుదైన (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)
తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)
నెల్లూరు : ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం (ఫొటోలు)
ఆ రాళ్ళూ మాపై పడి ఉంటే... చంద్రబాబు, లోకేష్ లపై అంబటి ఫైర్
చిత్రహింసలు పెడుతూ రెండు రోజులు లాకప్ లో ...
రైతులు కాదు.. టీడీపీ రౌడీలు.. దాడి పై పేర్ని నాని రియాక్షన్
ఆపరేషన్ సిందూర్ వీరుడిగా మురళి నాయక్ కు గుర్తింపు
ఒకేసారి భారీగా పెరిగిన బంగారం తులం ఎంతంటే?