
ఇంటి చుట్టూ పచ్చదనం ఉంటే చూడటానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కానీ, కొన్ని మొక్కలు తెలియకుండానే పాములకు ఆశ్రయం కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ మొక్కలు పాములను నేరుగా ఆకర్షించకపోయినా..
వాటి చుట్టూ ఏర్పడే దట్టమైన నీడ, తేమ, చిన్న జీవుల సంచారం కారణంగా పాములు అక్కడికి వచ్చే అవకాశం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.పాములు తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి చల్లటి, నీడ ఎక్కువగా ఉండే ప్రదేశాలను ఇష్టపడతాయి. అలాగే ఎలుకలు, కప్పలు, బల్లులు వంటి చిన్న జీవులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు ఆహారం కోసం కూడా వస్తుంటాయి. అందుకే ఇంటి తోటలో కొన్ని రకాల మొక్కలు ఉంటే వాటి వద్ద పాములు కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.వెదురు: వెదురు మొక్కలు చాలా దట్టంగా పెరుగుతాయి. వీటి మధ్య చల్లటి నీడ, దాక్కునేందుకు అనువైన ప్రదేశం ఏర్పడుతుంది. ముఖ్యంగా గోడలు, కంచెల పక్కన వెదురు పెంచితే పాములు దాక్కునే అవకాశం పెరుగుతుంది.పెరివింకిల్, ఐవీ తీగలు: ఇవి బిళ్లగన్నేరు జాతికి చెందిన తీగలు. ఇవి నేలపై దట్టంగా పరుచుకుంటాయి. దీంతో కింద ఏం జరుగుతుందో కనిపించదు. ఆకులు, తేమ ఎక్కువగా ఉండటంతో పాములకు ఇవి అనువైన ఆశ్రయంగా మారుతాయి.నిమ్మ గడ్డి: ఈ మొక్కలు గుబురుగా పెరిగి అడుగు భాగంలో ఖాళీ ప్రదేశాన్ని ఏర్పరుస్తాయి. చల్లటి నీడ కారణంగా పాములు విశ్రాంతి తీసుకునేందుకు ఇవి అనుకూలంగా ఉంటాయి.మల్లె మొక్కలు: మల్లె పొదలు దట్టంగా పెరుగుతాయి. వీటి వద్ద ఎలుకలు, కీటకాలు, చిన్న జీవులు ఎక్కువగా సంచరిస్తాయి. వాటి కోసం