వర్షాకాలంలో తేమ ఎక్కువడా ఉండటం వల్ల పప్పులు, సేమియా వంటివి తొందరగా పాడవుతాయి. ఇలా జరగకుండా ఉండేందుకు ముందుగా పప్పులు, సేమియాను డ్రై రోస్ట్ చేయండి. పూర్తిగా చల్లారాక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయండి.
మసాలాలు, ఉప్పు, చక్కెరలో ఉండే స్పూన్ తడిగా కాకుండా చూసుకోండి. స్పూన్ తడిగా ఉంటే ఇవి పాడవుతాయి. అందుకే డ్రై స్పూన్ వాడటం మంచిది.
ఉప్పు, చక్కెరతో పాటు మసాలా డబ్బా మూతలు గట్టిగా బిగించండి. లేదంటే గాలిలోని తేమ వీటికి తాకడం వల్ల తొందరగా పాడవుతాయి. అందుకే మూతలు లూజ్ లేకుండా చూసుకోండి.
ఆకుకూరలు ముందుగా బాగా కడిగి పూర్తిగా ఆరబెట్టండి. తర్వాత పేపర్ టవల్, ముస్లిన్ క్లాత్లో చుట్టి నిల్వ చేయండి. గాలి చొరబడని డబ్బాలో ఉంచితే మంచిది.
వర్షాకాలంలో పిండికి తొందరగా పురుగులు పడతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే పిండి ఏదైనా గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్లో నిల్వ చేస్తే సరిపోతుంది.
బిర్యానీ ఆకులు ధాన్యాలు పాడవుకుండా, పురుగులు పట్టకుండా కాపాడుతాయి. దీనికోసం వీటిని నిల్వ చేసే సంచి లేదా డబ్బాలో బిర్యానీ ఆకులు వేస్తే సరిపోతుంది.
వేపాకుల్లోని యాంటీ మైక్రోబియల్ గుణాలు బియ్యం, పిండి, పప్పులకు పురుగులు పట్టకుండా చూస్తాయి. అందుకే వీటిని నిల్వ చేసే డబ్బాలో వేపాకులు వేస్తే సరిపోతుంది.
లవంగాల నుంచి వచ్చే ఘాటు వాసనకు పురుగులు రాకుండా ఉంటాయి. అందుకే వర్షాకాలంలో పప్పులు, బియ్యం, పిండి వంటి ధాన్యాలను నిల్వ చేసే డబ్బాలో లవంగాలు వేస్తే మంచిది.
ఉల్లిపాయలు, వెల్లుల్లి, బంగాళాదుంప, క్యారెట్ వంటి వాటిని చల్లటి, చీకటి ప్రదేశంలో ఉంచండి. గాలికి ఉంచితే తొందరగా పాడవుతాయి.