
సాయికృష్ణ మృతిపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు ఇచ్చింది. సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్కు నోటీసలు జారీ చేసింది. వారం రోజుల్లో చర్యల నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
సాయికృష్ణ మృతిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ కీలక ఆదేశాలు ఇచ్చింది. సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీ, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌కు నోటీసలు జారీ చేసింది. వారం రోజుల్లో చర్యల నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సాయికృష్ణను కృష్ణలంక పోలీసు స్టేషన్‌ సిబ్బంది అక్రమంగా అపహరించారని.. కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని, ఆ కారణంగా ఆయన మరణించాడని తమకు ఫిర్యాదు అందినట్లు తెలిపింది.సాయికృష్ణ మృతిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో తమకు వచ్చిన ఫిర్యాదు పై స్పందించింది. ఈ నేరాన్ని దాచేందుకు కొందరు పోలీసు అధికారులు మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై శ్మశానానికి తీసుకెళ్లి.. కాల్చి అవశేషాలను నదిలో కలిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కృష్ణలంక సీఐ నాగరాజు, ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న ఇతరులను కఠినంగా శిక్షించాలని కోరారు. పోలీసు స్టేషన్‌ సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని.. ఈ వ్యవహారంలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించారు. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన వార్తలను కమిషన్‌ పరిగణనలోకి తీసుకుంది. సిట్‌.. తన ప్రాథమిక విచారణలో కస్టోడియల్‌ మరణం చోటుచేసుకున్నట్లు పేర్కొంది. ప్రధాన నిందితుడు నాగరాజును సస్పెండ్‌ చేసి, జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. ఫిర్యాదులోని అంశాలు, మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవమే అయితే.. ఇది దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనే అని ఘాటు వ్యాఖ్యలు చేసింది.కిషన్ రెడ్డి, రామ్మోహన్ కు కొత్త శాఖలు- తెలుగు రాష్ట్రాల నుంచి ఇన్.. అవుట్..!?NHRC నోటీసులతోఅక్రమ నిర్బంధం, చిత్రహింసలు, కస్టోడియల్‌ డెత్‌.. రాజ్యాంగం ప్రసాదించిన అత్యంత విలువైన జీవించే హక్కుపై ప్రత్యక్ష, క్రూర దాడేనని అభిప్రాయ పడింది. పోలీసులపై వచ్చిన ఆరోపణలు.. అధికార దుర్వినియోగం, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలపై నమ్మకం కోల్పోవడాన్ని ప్రతిబింబిస్తున్నాయని... సంరక్షకులు కుట్రదారులయ్యారని పేర్కొంది. వారి చర్యలు దేశీయ చట్టాల ఉల్లంఘనే కాకుండా.. భారత్‌ కట్టుబడి ఉన్న అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాలకు విరుద్ధమని కమిషన్‌ అభిప్రాయపడింది. ఆరోపణల తీవ్రత దృష్ట్యా డీజీపీకి, విజయవాడ పోలీసు కమిషనర్‌కు నోటీసులు జారీచేయాలని ఆదేశించింది. వారు వారంలోగా సమగ్ర చర్యల నివేదికను సమర్పించాలని తేల్చిచెప్పింది. ఆ నివేదికలో సిట్‌ దర్యాప్తు ప్రస్తుత స్థితి, సంబంధిత పోలీసు అధికారులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ వివరాలను పేర్కొనాలి. సాయికృష్ణ అక్రమ నిర్బంధం, కస్టడీ హింస, మరణం, మృతదేహం తరలింపునకు బాధ్యులైన పోలీసు అధికారుల వివరాలు చెప్పాలని స్పష్టం చేసింది.