
ములుగు : ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పడి(Lightning) 21 ఆవులు, ఒక ఎద్దు, విద్యుత్ షాక్ తో మరో కాడెద్దు మృతి చెందింది.
ఈ విషాదకర సంఘటన తాడ్వాయి మండలంలోని అంకంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంకిడి సమ్మయ్యకు చెందిన 21 ఆవులు, ఒక ఎద్దు శుక్రవారం అర్ధరాత్రి పిడుగుపాటుతో మృతి చెందాయి. అలాగే లింగాల గ్రామంలో విద్యుత్ షాక్తో మరో రైతుకు చెందిన దుక్కిటెద్దు మృతి చెందింది. ఆవుల మృతితో తనకు తీవ్ర నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
Utkoor | 13 ఏళ్ల బాలుడిగా వెళ్లి.. 24 ఏళ్ల యువకుడిగా తిరిగొచ్చిన హనుమంతు
Ayodhya Temple Trust | అయోధ్య ఆలయ ట్రస్ట్ చీఫ్ రాజీనామా.. అదే బాటలో ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా
Goutham Adani | అమెరికా కోర్టుకు అదానీ వాదన సమర్పణ.. అందులో మాజీ సీజేఐ నివేదిక