వర్షం నీళ్లు జుట్టును తొందరగా డ్యామేజ్ చేస్తాయి. ఇలా జరగకుండా ఉండేందుకు గోరువెచ్చని కొబ్బరి నూనెతో తలకు మర్దన చేయండి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు రాలడం తగ్గుతుంది.
వర్షం నీరు ఎసిడిక్ గుణం, హానికర కాలుష్య కారకాలను కలిగి ఉంటుంది. ఇది జుట్టును తొందరగా డ్యామేజ్ చేస్తుంది. అందుకే వర్షంలో తడిస్తే సల్ఫేట్ ఫ్రీ షాంపూతో తలస్నానం చేయండి. దీంతో కుదుళ్లలో ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. జుట్టు హెల్తీగా ఉంటుంది.
మెంతుల్లో ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి కుదుళ్లకు బలాన్ని అందించి జుట్టు రాలడం నివారిస్తాయి. దీనికోసం రాత్రంతా మెంతులు నానబెట్టి ఉదయం పేస్ట్ చేసి తలకు రాసుకోండి. అరగంట పాటు ఉంచి తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు.
కోడిగుడ్లలో ప్రోటీన్ ఉంటుంది. ఇది కెరాటిన్ ఉత్పత్తిని పెంచి జుట్టును బలంగా మారుస్తుంది. దీనికోసం కోడిగుడ్లను గిలకొట్టి తలకు రాసుకోండి. 10 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
వర్షాకాలంలో అధిక తేమ వల్ల కుదుళ్లు జిడ్డుగా మారి పీహెచ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దీనిని నివారించేందుకు తలకు అలోవెరా అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేయడం మంచిది. వారంలో ఒకసారి ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ తెలిపింది.
వర్షాకాలంలో జుట్టును హెల్తీగా ఉంచడంలో తేనె, నిమ్మరసం సహాయపడతాయి. దీనికోసం కొద్దిగా తేనె, నిమ్మరసంలో కోడిగుడ్డు కలిపి పేస్ట్ చేయండి. దీనిని తలకు రాసుకుని 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
వర్షం నీటిలో తడిచాక చాలామంది టవల్‌తో గట్టిగా తుడుస్తుంటారు. ఇలా చేస్తే రాపిడి పెరిగి జుట్టు రాలుతుంది. ఎందుకంటే తడి జుట్టు సెన్సిటివ్‌గా ఉంటుంది. కాబట్టి మైక్రోఫైబర్ టవల్‌తో మెల్లగా తుడిస్తే సరిపోతుంది.
వర్షాకాలంలో జుట్టుకు బలాన్ని అందించే ఆహారాలు తీసుకోండి. ముఖ్యంగా కోడిగుడ్లు, చికెన్, పప్పులు, బీన్స్, గింజలు, ధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. ఇవి జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు సహాయపడతాయి.
వర్షంలో తడిచిన జుట్టును అస్సలు దువ్వకూడదు. పొడిగా అయ్యాక తుడవాలి. అలాగే జుట్టు తడిగా ఉన్నపుడే జడ వేయడం వల్ల కూడా జుట్టు రాలుతుంది.