తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు బోయపాటి శ్రీను నెక్ట్స్ సినిమాపై చిత్ర పరిశ్రమలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
వెండితెరపై హీరోలను ఊర మాస్ రేంజ్లో ఎలివేట్ చేస్తూ, థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడంలో బోయపాటి శైలి ప్రత్యేకం. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో ఆయనకు ఉన్న సక్సెస్ ట్రాక్ రికార్డ్ అసాధారణమైనది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించాయి. అయితే బాలకృష్ణ కాకుండా ఇతర స్టార్ హీరోలతో బోయపాటి చేసిన ప్రయోగాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాయి. గత కొంతకాలంగా బాలయ్య మినహా మిగిలిన హీరోలతో ఆయన చేసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా లేదా పరాజయాలుగా మిగిలాయి. ఈ క్రమంలోనే గతేడాది భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీరి క్రేజీ సీక్వెల్ ‘అఖండ-2’ సైతం ట్రేడ్ వర్గాలను నిరాశపరిచింది. ఈ చిత్రం మిక్స్డ్ టాక్కే పరిమితమవ్వడమే కాకుండా, దాదాపు రూ. 80 కోట్లకు పైగా భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని ఇండస్ట్రీ టాక్.* చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం చెప్పేందుకు మరియు తన సక్సెస్ గ్రాఫ్‌ను మళ్లీ టాప్కు తీసుకెళ్లేందుకు బోయపాటి ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా, ఈసారి కోలీవుడ్ మార్కెట్‌పై కన్నేశారు. విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తమిళ స్టార్ హీరో సూర్యతో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయడానికి బోయపాటి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సూర్యకు ఒక పవర్ఫుల్ స్టోరీ లైన్ వినిపించగా, దానికి ఆయన పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనితో ఏమాత్రం సమయం వృథా చేయకుండా బోయపాటి శ్రీను ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.* ‘కొత్తగా ఏముంది? చూసినట్టే ఉంది.. అందుకే పోయింది’... గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌పై దిల్ రాజు సూర్య నటనకు, బోయపాటి మార్క్ అల్ట్రా మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ తోడైతే వెండితెరపై సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఉత్తరాది ప్రేక్షకులను సైతం మెప్పించేలా ఈ కథను పాన్ ఇండియా స్థాయిలో బోయపాటి మలుస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు సమాంతరంగా టాలీవుడ్‌కు చెందిన మరో క్రేజీ హీరోతో కూడా ఆయన చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. మరి సూర్యతో చేయబోయే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో బోయపాటి శ్రీను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కి తన సత్తా చాటుకుంటారో లేదో చూడాలి. సూర్య ఇటీవలే ‘కరుప్పు’తో రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.