
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Hyderabad Donald Trump Avenue President Reacts: జూన్ 23, 2026న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని యుఎస్ కన్సులేట్‌కు ఆనుకొని ఉన్న ఒక ప్రధాన రహదారిని 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వెనుక కొన్ని వ్యూహాత్మక అంశాలు ఉన్నాయి. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించి, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం ఈ పేరు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. డిసెంబర్లో జరగనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు ముందు ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని తిప్పుకోవాలనే లక్ష్యంతో ఈ ఆలోచన చేశారు. దీనిని ప్రతిపాదించినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అమెరిక సంస్థలతో నిండిపోయిన హైదరాబాద్ నగరాన్ని 'సైబరాబాద్' అని కూడా పిలుస్తారు, అందుకే ఆ అమెరికా అధ్యక్షుడి పేరును ఈ రోడ్డుకు పెట్టారు.
ట్రూత్ సోషల్ వేదికగా అమెరికా అగ్రనేత ఇలా రాసుకొచ్చారు.. "భారతదేశంలోని హైదరాబాద్‌లో 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' అని కొత్తగా పేరు పెట్టారు. నాకు ఇలాంటి గౌరవం దక్కడం చాలా ఆనందంగా ఉంది, ధన్యవాదాలు. ఇలా గౌరవించబడిన మొదటి అమెరికా అధ్యక్షుడిని నేనే" అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఈ రోడ్డుకు పేరు పెట్టే కార్యక్రమంలో అమెరికా రాయబారి సెర్గియో, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొని, 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' ఫలకాన్ని లాంఛనప్రాయంగా ఆవిష్కరించారు.
అమెరికా 'ఫ్రీడం 250' వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు, దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమంలో సీనియర్ దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, రక్షణ, ఏరోస్పేస్ రంగాల నాయకులు పాల్గొని, అమెరికా-భారత్ బంధాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రాముఖ్యత పెరుగుతోందని అన్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం స్థిరంగా ఉండటమే కాకుండా, వాణిజ్యం , పెట్టుబడులు కూడా వేగంగా వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
ఈ రోడ్డుకు ఎందుకు ఈ పేరు పెట్టారంటే... హైదరాబాద్‌లో ఈ రోడ్డు గుండానే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రధాన అమెరికన్ దిగ్గజ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. అందుకే ఈ రహదారిని 'ట్రంప్ అవెన్యూ'గా నామకరణం చేశారు. అమెరికా రాయబారి మాట్లాడుతూ, అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన బలమైన, గౌరవప్రదమైన భాగస్వామ్యానికి ఈ చర్య నిదర్శనమని అన్నారు.
చారిత్రాత్మకంగా భారతదేశంలో రహదారులకు దివంగతలు మహాత్మా గాంధీ లేదా నెల్సన్ మండేలా వంటి మహనీయుల పేర్లు పెట్టడం చూశాం. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గూగుల్, టాటా వంటి ప్రపంచ స్థాయి సంస్థల అధిపతుల పేర్లను రహదారులకు ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ, భారత్‌లో ఇలా గౌరవించబడిన మొదటి అమెరికా అధ్యక్షుడిని తానేనంటూ ట్రూత్ సోషల్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.