Investment Strategy : సంపాదించే వయసులో అంతా బాగానే ఉంటుంది. అప్పటి ఖర్చులకు ఉంటే సరిపోతుందని భావించేవారు చాలా మందే ఉంటారు.
ఈరోజు బానే ఉన్నాం కదా అనుకుంటే పొరపాటే భవిష్యత్తు గురించి కూడా ముందు నుంచే పక్కా ప్రణాళికతో ఉండాలని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. ఉద్యోగ జీవితమంతా కష్టపడి సంపాదించి, ఇన్వెస్ట్మెంట్లు పెట్టి, రిటైర్మెంట్ కోసం డబ్బుల్ని కూడబెట్టడం ఒక ఎత్తు అయితే.. రిటైర్మెంట్కు ముందు చివరి ఐదేళ్లు ఆ సంపదను ఎలా కాపాడుకోవాలనే విషయం కూడా అత్యంత కీలకమైన దశ అని సూచిస్తున్నారు. అప్పుడు తీసుకునే నిర్ణయాలే రిటైర్మెంట్ తర్వాత 20-30 ఏళ్ల ఆర్థిక జీవితాన్ని నిర్ణయిస్తాయని ప్రముఖ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ పరిమల్ అడే తన సోషల్ మీడియా పోస్టులో వివరించారు. ఆయన పోస్ట్ ప్రకారం రిటైర్మెంట్కు ముందరి ఐదేళ్లు విమానం ఎగిరేందుకు అవసరమైన రన్‌వే లాంటిది. రన్‌వే సరిగా ఉంటేనే ప్రయాణం సురక్షితంగా సాగుతుందన్న ఉద్దేశంతో చెప్పారు. అలానే రిటైర్మెంట్ కూడా సరైన ప్రణాళికతోనే సుఖమయంగా ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆ సమయంలో కొన్ని పొరపాట్లు చేయొద్దని చెబుతున్నారు. ఆయన మాటల్లోనే చూద్దాం.ఈ కార్పస్ చాలుతుందని భావించడంచాలా మంది రూ. 3-5 కోట్ల రిటైర్మెంట్ ఫండ్ ఉంటే చాలు జీవితాంతం హాయిగా ఉండొచ్చని భావించడం చాలా పెద్ద తప్పు. కానీ ద్రవ్యోల్బణం , పెరుగుతున్న వైద్య ఖర్చులు, జీవన వ్యయం, పన్నులు వంటి అంశాల్ని చూస్తే ఇది సరిపోవకపోవచ్చని, అందుకే రిటైర్మెంట్ కార్పస్‌ను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అంచనా వేయాలి. సీక్వెన్స్ ఆఫ్ రిటర్న్స్ రిస్క్‌ను నిర్లక్ష్యం చేయడంరిటైర్మెంట్ అయిన వెంటనే మార్కెట్ పడిపోతే ప్రమాదం. ఎందుకంటే మీరు డబ్బు విత్‌డ్రా చేస్తున్న సమయంలోనే పోర్ట్‌ఫోలియో వాల్యూ తగ్గుతుంది. ఇది మీ సంపదను వేగంగా క్షీణించేలా చేస్తుంది. అందుకే మొత్తం పెట్టుబడుల్ని ఒక్కసారిగా మార్కెట్‌పై ఆధారపడేలా ఉంచొద్దు. చివరి ఐదేళ్లలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోవాలి. పూర్తిగా సేఫ్ ఇన్వెస్ట్మెంట్లకే మొగ్గుచూపడంరిటైర్ అవుతున్నాం కదా అని మొత్తం డబ్బును FD, లేదా ఇతర తక్కువ రాబడి వచ్చే సురక్షిత సాధనాల్లోనే పెట్టడం కూడా మంచి పద్ధతి కాదు. రిటైర్మెంట్ తర్వాత ఇబ్బందుల్లేకుండా జీవించాలంటే ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు కొంత భాగం అధిక వృద్ధి ఇచ్చే సాధనాల్లో కూడా పెట్టుబడి పెట్టాలి. అత్యవసర నిధులు లేకపోవడంఈపీఎఫ్, ఎన్పీఎస్, యాన్యుటీలు ఉన్నా చాలదు. వైద్య అవసరాలు, కుటుంబ అవసరాలు, ఇంటి మరమ్మతులు, అనుకోని ఖర్చుల కోసం వెంటనే ఉపయోగించుకునే లిక్విడ్ ఫండ్స్ తప్పనిసరిగా ఉండాలి. టాక్స్ ప్లానింగ్‌పై నిర్లక్ష్యంగా ఉండటంరిటైర్మెంట్ తర్వాత క్యాపిటల్ గెయిన్స్, పెన్షన్, యాన్యుటీ ఆదాయం, వడ్డీ ఆదాయం, పెట్టుబడుల ఉపసంహరణలపై పన్ను ప్రభావం ఉంటుంది. రిటైర్మెంట్కు ముందుగా ఐదేళ్లలో టాక్స్ ప్లానింగ్ చేస్తేనే భవిష్యత్తులో పన్ను భారం తగ్గించుకోవచ్చు.హెల్త్ కేర్ ప్లాన్ చేయకపోవడంభారత్లో ఆస్పత్రి ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రిటైర్మెంట్ తర్వాత వయసు మళ్లిన సమయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే రిటైర్మెంట్కు ముందు చివరి ఐదేళ్లలో అయినా సరైన హెల్త్ ఇన్సూరెన్స్, ప్రత్యేక మెడికల్ ఎమర్జెన్సీ ఫండ్ వంటివి తప్పనసరిగా ఏర్పాటు చేసుకోవాలి. విల్, నామినేషన్లు సిద్ధం చేయకపోవడంచాలా మంది జీవితాంతం సంపాదించిన ఆస్తులకు వీలునామా రాయకపోవడం, బ్యాంక్ అకౌంట్లు, పెట్టుబడులకు సంబంధించి నామినీ వివరాల్ని అప్డేట్ చేయకపోవడం వల్ల కుటుంబ సభ్యులు అనవసర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే ఈ ప్లానింగ్ కూడా అత్యంత ముఖ్యమని చెబుతున్నారు. చివరగా రిటైర్మెంట్ అనేది ఒక్కరోజులో తీసుకునే నిర్ణయం కాదు. కాబట్టి ఉద్యోగ జీవితంలో చివరి ఐదేళ్లలోనే తీసుకున్న చిన్న చిన్న ఆర్థిక నిర్ణయాలు కూడా మంచి రిటైర్మెంట్కు పునాది వేస్తుందని చెప్పొచ్చు. సరైన పెట్టుబడి వ్యూహం, టాక్స్ ప్లానింగ్, అత్యవసర నిధులు, ఆరోగ్య భద్రత, కుటుంబ భవిష్యత్తుకు పక్కాగా ప్లాన్ చేస్తే... రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా స్వేచ్ఛగా, ఒత్తిడి లేకుండా జీవించొచ్చు.