పొదరిల్లు సీరియల్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్గా నడుస్తోంది. బృందావనం.. అందులోని మనుషులు.. పెద్ది పాత్ర, చక్రి ప్రేమ కథ.. బండరాయి లాంటి వాడైన కేశవ ప్రేమ కథ.. కన్నా పుట్టుకకు సంబంధించిన గతం..
మహా లక్ష్యం, గమ్యం, ఆమెలో ప్రేమ పుడుతుందా? లేదా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో పొదరిల్లు సీరియల్ ముందుకు సాగుతోంది. ఈ వారం అంతా కూడా మహాలక్ష్మీ, చక్రి చుట్టూనే తిరిగింది. చక్రి తప్పతాగి రావడం, మహాలక్ష్మీ ఉన్న రూంలోకి వెళ్లడం, పిచ్చి పిచ్చిగా వాగడం, మహా బెదిరిపోవడం అందరికీ తెలిసిందే. తాగిన మత్తులో చివరకు పెద్ది మీదకే చక్రి చేయి ఎత్తుతాడు చక్రి.చక్రి ప్రవర్తనకు బెదిరిపోయిన మహాలక్ష్మీ వెంటనే ఓ వర్కింగ్ హాస్టల్లో జాయిన్ అయిపోతుంది. చక్రిని ఇంట్లో వాళ్లంతా అసహ్యించుకుంటారు. ఇలాంటి పని చేస్తావా? వదినను ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేశావ్ అని కన్నా గాడు కూడా చక్రిని తిడతాడు. సభ్యత, సంస్కారం అన్నీ మర్చిపోయావ్ అని పెద్ది ఆగ్రహిస్తాడు. నీలాంటి వాడ్ని చూస్తేనే అసహ్యంగా ఉంది రా అని కేశవ ఫైర్ అవుతాడు. తనను తాకలేదు.. తనతో తప్పుగా ప్రవర్తించలేదు.. తాగి రూంలోకి వెళ్లడమే తాను చేసిన తప్పు అని చక్రి బాధపడుతుంటాడు. కానీ ఇంట్లో వాళ్లెవ్వరూ కూడా చక్రిని క్షమించరు. నారాయణ కూడా చక్రిని తిడతాడు. తాను ఇచ్చిన సలహాని తప్పుగా అర్థం చేసుకున్నాడు అని చక్రి మీద నారాయణ కూడా ఫైర్ అవుతాడు.🔹‘బ్రహ్మముడి’ టుడే ఎపిసోడ్ : నీ పని నువ్వు చూసుకో.. నా విషయాల్లో తలదూర్చకు.. ఇందుకి రాజు వార్నింగ్మహాలక్ష్మీని క్షమించమని అడగాలంటూ చక్రి పదే పదే ప్రయత్నిస్తాడు. ఆఫీసుకి వెళ్తాడు, హాస్టల్ వద్ద సీన్ క్రియేట్ చేస్తుంటాడు. కానీ మహా మాత్రం చక్రిని చూసేందుకు, క్షమించేందుకు కూడా ఇష్టపడదు. చక్రి ఇలా చేయడానికి నేనే కారణం అని నారాయణ చెబితే.. మహా షాక్ అవుతుంది. నారాయణని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి పంపించేస్తుంది మహా. ఇంకో వైపు కేశవ, శైలు లవ్ స్టోరీ కాస్త ముందుకు కదిలింది. చివరక శైలు తన మనసులోని ప్రేమను చెప్పేసింది. కేశవ మాత్రం ఇది ప్రేమేనా? అనే సందిగ్ధంలో ఉండిపోతాడు. చక్రి తన అనుభవాలు చెబుతుంటే.. ప్రేమంటే ఇదేనా? అని కేశవ తెలుసుకుంటాడు.అయితే కేశవ మాత్రం తన ప్రేమని ఎప్పుడు చెబుతాడా? అని శైలు ఎదురుచూస్తుంటాడు. మహా తన ప్రేమని ఎప్పుడు అర్థం చేసుకుంటుందా? అని చక్రి పరితపిస్తుంటాడు. మరి మహా మనసు ఎప్పుడు చలిస్తుందో.. చక్రి మీద ప్రేమ ఎప్పుడు పుడుతుందో.. చూడాలి.