
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచనతో పాటు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి హైదరాబాద్లో తేలికపాటి వర్షం మొదలై రాత్రికి భారీ వర్షం కురిసే అవకాశముందని పేర్కొన్నారు. హైదరాబాదులో నేడు భారీ వర్షం |